దర్శకుడు రూంకి పిలిచాడు : జబర్దస్త్ సాయితేజ

11551
Jabardasth Saiteja About Director
Jabardasth Saiteja About Director

జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంట్రీ ఇచ్చి ఎంతో మంది కమెడీయన్స్ మంచి పేరు తెచ్చుకున్నారు. జబర్దస్త్ కు క్రేజ్ ఉన్నప్పటికి వివాదాలు కూడా అదే స్థాయిలో ఉంటున్నాయి. బుల్లితెరపై నవ్వించే ఈ కమెడియన్స్ పై బయట వివాదాలు కూడా ఉన్నాయి. కొందరు కమెడియన్స్ నిజజీవితంలో ఎన్నో బాధలుపడుతున్నారు. అయితే ఇదే జబర్దస్త్ ద్వారా మంచి పేరు తెచ్చుకున్నాడు సాయితేజ. లేడీ గెటప్స్ తో బాగా పాపులర్ అయ్యాడు.

లేడీ గెటప్స్ వేసి వేసి.. నిజజీవితంలో కూడా అమ్మాయిలానే మారిపోయాడూ. ఆపరేషన్ చేయించుకుని సాయితేజ కాస్త ప్రియాంకగా పేరు మార్చుకున్నాడు. సర్జరీ చేయించుకుని అమ్మాయిలా మారిన తర్వాత తనను చాలా మంది వేధించారని చెప్పాడు సాయితేజ.. ఇక జబర్దస్త్ వినోద్ పై దాడి గురించి చెబుతూ.. ఇంటి కొనుగోలు విషయంలో ఓనర్ చేతిలోనే దాడికి గురయ్యాడు వినోద్. అసలు వాడిపై దాడి చేసిన వాళ్లు మనషులే కాదు.. మృగాలు అంటూ సాయితేజ (ప్రియాంక) మండిపడ్డాడు.

ఆర్టిస్టుగా చేసి డబ్బు సంపాధించడం కష్టమని.. కానీ బయట కొందరు తమపై దారుణమైన కామెంట్స్ చేస్తారని చెప్పాడు. అంతేకాకుండా ఓ దర్శకుడు తనని రూమ్ కి పిలిచాడని.. అంతేకాకుండా అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పాడు సాయితేజ. ఆ దర్శకుడు ఫోన్ చేసి తమ సినిమాలో ఓ ఐటమ్ సాంగ్ ఉందని.. చేస్తారా అని అడిగాడని.. వెంటనే ఒప్పుకున్నట్లు చెప్పాడు సాయితేజ(ప్రియాంక). ఆ తర్వాత ఈ సాంగ్ లో ఎక్స్ పోజింగ్ చేయాలని చెప్పాడు.

అందుకు కూడా ఒప్పుకున్నట్లు తెలిపాడు. ఆ తర్వాత వరంగల్ లో మూడు రోజులు షూట్ ఉంటుందని.. కాకపోతే ఆ మూడు రోజులు తన రూంలోనే ఉండాలని.. నీతో పాటు మరో వ్యక్తి కూడా ఉంటారని చాలా నీచంగా మాట్లాడినట్లు చెప్పాడు. రూంలో ఉండనని.. తాను అలాంటి వ్యక్తిని కాదని ఆ దర్శకుడికి వార్నింగ్ ఇచ్చాడట సాయితేజ (ప్రియాంక).

Loading...