జబర్దస్త్ వినోద్ ఎవర్ని పెళ్లి చేసుకుంటున్నాడంటే ?

6654
jabardasth vinod marriage
jabardasth vinod marriage

జబర్దస్త్ కామెడీ షో లో లేడీ గెటప్ లు వేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు వినోద్ అలియాస్ వినోదిని. లేడీ గెటప్ లో వినోద్ ని చూస్తే ఖచ్చితంగా ఎవరైన అమ్మాయే అని నమ్మాల్సిందే. అప్పుడప్పుడు సినిమాల్లో కూడా నటిస్తున్నాడు వినోద్. అయితే తాజాగా జబర్దస్త్ వినోద్ ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ లో పలు ఆసక్తికర విషయాలు చెప్పాడు.

ఇందులో భాగంగా తాను తొందర్లోనే పెళ్లి చేసుకోబోతున్నానని పెళ్లికూతురు తన సమీప బంధువు అని తెలిపాడు.అలాగే ఇటీవలే వీరిద్దరికీ నిశ్చితార్థం కూడా అయినట్లు కూడా ప్రేక్షకులతో పంచుకున్నాడు. అయితే తాజాగా తన పై దాడి జరగడంతో పెళ్లిని కొంతకాలం పాటు వాయిదా వేసుకోవలసి వచ్చిందని తెలిపాడు.అయితే ప్రస్తుతం కరోనా వైరస్ కలకలం సృష్టిస్తున్నడంతో మరోమారు తన పెళ్ళి వాయిదా పడినట్లు తెలుస్తోంది.

అయితే ప్రస్తుతం వినోద్ బాలీవుడ్ హాట్ హీరోయిన్ పూనం పాండే నటిస్తున్న ఓ సినిమాలో నటించే ఛాన్స్ దక్కించుకున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ లో కూడా పాల్గొన్నాడు. అయితే తక్కువ టైంలో బాలీవుడ్ ఆఫర్ రావడంలో ఆ సినిమా కోసం బాగా కష్టపడుతున్నాడట. జబర్దస్త్ లో చేస్తే ఆ సినిమాలో నటిస్తున్నాడు. ఏ పరిస్థితుల్లోనైన జబర్దస్త్ ను వదిలే ప్రసక్తి లేదని చెబుతున్నాడు.

Loading...