హైపర్ ఆది, అనసూయ మధ్య ఏం ఉంది ?

2766
jabardasth what happening between hyper aadi and anasuya baradwaj
jabardasth what happening between hyper aadi and anasuya baradwaj

జబర్దస్త్ షో లో అందరిదీ ఒక్క ఎత్తు అయితే సుధీర్, హైపర్ ఆదిది మరో ఎత్తు. ఎందుకంటే రష్మీ గౌతమ్ – సుధీర్ కలిసి షోని బాగా హైలైట్ చేస్తారు. అలానే అనసూయ – ఆది కూడా అలానే షోని హైలైట్ చేస్తారు. ఈ జోడిలపై ఇప్పటికే రకరకాల రూమర్స్ వచ్చాయి. ఆది ఏ స్కిట్ చేసిన అందులో కచ్చితంగా అనసూయ గురించి మూడు నాలుగు పంచులు మాత్రం పక్క ఉంటాయి.

తమ మధ్య ఏదో ఉందని చెప్పడానికే హైపర్ ఆది బాగా ట్రై చేస్తుంటాడు. కానీ నిజానికి వీరిద్దరి మధ్య ఏం లేదు. అనసూయకు పెళ్ళై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కాబట్టి ఆదిని ఆమెతో పోల్చలేం. ఇద్దరివీ డిఫరెంట్ దారులు. అయితే ఈ మధ్య వీరిద్దరూ బాగా ఓవర్ చేస్తున్నట్లు అర్ధం అవుతుంది. ప్రోగ్రాం నిర్వాహకులు ఈ గాసిప్‌ను క్యాచ్ చేసుకొని రేటింగ్ పెంచుకోవడానికి తహతహలాడుతున్నారని కూడా నెటిజన్లు అంటున్నారు.

రష్మీ-సుధీర్ జోడీ ఎంత హిట్ అయ్యిందో.. ఈ జోడీని కూడా అలా హిట్ చేసేందుకు ఎత్తులు వేస్తున్నారని చెబుతున్నారు. ఎక్స్‌ట్రా జబర్దస్త్‌లో రష్మీ, సుధీర్ ఉంటారు కాబట్టి.. హైపు బాగానే ఉంటుంది. ఇప్పుడు జబర్దస్త్ లో హైపర్ ఆది, అనసూయ లను హైలైట్ చేస్తే మరింత వ్యూవర్ షిప్ పెరుగుతుందని నిర్వాహకులు ఎత్తుగడలు వేస్తున్నారని నెటిజన్లు అంటున్నారు. హైపర్ ఆది స్కిట్ నడుస్తున్నంత సేపు అనసూయ పైనే కెమెరా ఉంటుంది. ఆది ఏ పంచ్ వేసిన వెంటనే అనసూయ తన హావభావాలను పలికించి షోని మరింత రక్తి కట్టించేలా చేస్తోంది.

ఈ మధ్య హీరోలను అనుకరిస్తూ హైపర్ ఆది స్కిట్ లు చేస్తున్నాడు. ఇలాంటి స్కిట్ లపై ప్రేక్షకుల్లో ఒకరకమైన అసహనం వస్తుంది. హీరోలను కించపరిచేలా స్కిట్ చేస్తున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే హైపర్ ఆదివి సరికొత్త గెటాపులు అంటూ అనసూయ పొగిడేస్తోంది. ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అని, షో రేటింగ్ పెంచుకోవడానికి ఇలా చేస్తున్నారని అంటున్నారు.

Loading...