Wednesday, April 24, 2024
- Advertisement -

స్టార్ హీరో సినిమా నుంచి తప్పుకున్న జగపతిబాబు

- Advertisement -

ఈ మధ్యనే ‘మహర్షి’ అనే సినిమాతో మంచి హిట్ ను అందుకున్న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’ అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ బాబు ఆర్మీ మేజర్ గా కనిపించబోతున్నాడు. భారీ అంచనాల మధ్య విడుదల కాబోతున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా గత కొంత కాలంగా సినిమాలకు దూరమైన విజయశాంతి ఈ సినిమాతో మళ్ళీ తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. జగపతిబాబు, రాజేంద్రప్రసాద్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

కానీ తాజా సమాచారం ప్రకారం జగపతిబాబు ఈ చిత్ర బృందానికి పెద్ద షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. జగపతిబాబు ఈ సినిమా నుంచి తప్పుకున్నారట. కారణాలు తెలియదు కానీ జగపతిబాబు ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర బృందం జగపతి బాబు స్థానంలో ప్రకాష్ రాజ్ ని ఎంపిక చేసినట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడాల్సి ఉంది. అనిల్ శంకర మరియు దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -