Friday, April 26, 2024
- Advertisement -

టాలీవుడ్ హీరోలకు పవన్ వార్నింగ్..!

- Advertisement -

పవన్ కళ్యాణ్ పూర్తిగా సినిమాలను వదిలేసి రాజకీయాల్లోకి వచ్చారు. మొన్న జరిగిన ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి.. రెండు చోట్ల ఘోర పరజాయంను చూశారు. అయితే ఇటీవలే పవన్ కళ్యాణ్ తెలుగు భాషను కాపాడలంటూ జగన్ ప్రభుత్వంపై షాకింగ్ కామెంట్స్ చేశాడు.

మన భాషను కాపాడుకుందాం.. ఇంగ్లీష్ నేర్చుకున్నా కూడా తెలుగును బతికించుకుందామంటూ గళమెత్తుతున్నాడు. అయితే ఇప్పుడు ఉన్నట్లు ఉండి తెలుగు ఇండస్ట్రీపై పవన్ కన్ను పడింది. ఏకంగా హీరోలపైనే పడ్డాడు. తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది హీరోలకు తెలుగు చదవడం, రాయడం రాదని.. అది నేర్చుకోవాల్సిన కనీస బాధ్యత కూడా లేదా అంటూ విమర్శలు చేసాడు పవన్ కల్యాణ్.

నిజంగానే మన ఇండస్ట్రీలో మహేష్ బాబు సహా మరికొందరు హీరోలకు తెలుగు చదవడం రాదు. కానీ వాళ్లు అవేం తెలియకుండా చక్కగా తమ పని తాము చేసుకుంటున్నారు. కానీ పవన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. టాలీవుడ్‌లో తెలుగు దిగజారిపోతుందని.. దాన్ని బతికించాల్సిన బాధ్యత దర్శక నిర్మాతలతో పాటు నటులపై కూడా ఉందని అన్నారు.

అయితే పవన్ చేసిన వ్యాఖ్యలకు కొందరు కౌంటర్లు కూడా ఇస్తున్నారు. అప్పట్లో పవన్ తన ప్రతీ సినిమాలో ఇంగ్లీష్, హిందీ పాటలను పెట్టాడు. మరి అప్పుడు తెలుగు గురించి ఏం తెలియలేదా అంటూ పవన్ పై పంచులు వేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -