Saturday, April 20, 2024
- Advertisement -

ఎన్టీఆర్ నిద్ర లేచేసరికి అలా ఉండాల్సిందే..

- Advertisement -

ఎన్టీఆర్ కి పెళ్లి అయ్యి ఆరెళ్లు అవుతోంది. అయితే ఇప్పటివరకు ఎక్కడ కూడా ఎన్టీఆర్ తన భార్య ప్రణతి గురించి ఎక్కువగా మాట్లాడలేదు. ప్రణతి కూడా ఏదన్న ఫంక్షన్స్ ఉంటే తప్ప.. బయట ఎక్కువగా కనిపించదు. అయితే ఎన్టీఆర్ ఓ మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన భార్య మీద ఆసక్తికరమైన విషయాలు తెలిపాడు.

ఎన్టీఆర్ మాట్లాడుతూ నాకు ఉన్న ఒక విచిత్రమైన అలవాటుకి నా భార్య సర్ధుకుపోతు వ్యవహరించే తీరుని వివరించగానే అక్కడ ఉన్న వాళ్లు షాక్ అయ్యారట. ఎన్టీఆర్ కి ఎక్కడ వస్తువులు అక్కడ వాటి వాటి స్థానాలలో ఉండాలి, వాటిని వేరే చోట పెట్టకూడదు అనే అలవాటు ఉందట. దీనిని వైద్య శాస్త్రంలో (ఒబిసిసివ్ కంపల్సివ్ డిజార్డర్) అని అంటారు. ఉదాహరణకు జూనియర్ కు నిద్ర లేవగానే బ్రష్ చేసుకోవడానికి తన బాత్ రూమ్ లోకి వెళ్ళినప్పుడు వాష్ బేసిన్ దగ్గర తన కుడి చేతి వైపు టూత్ బ్రష్ అలాగే ఎడమ చేతి వైపు టూత్ పేస్ట్ కరక్ట్ గా ఉండకపోతే జూనియర్ కు విపరీతమైన అసహనంగా మారుతుందట. పెట్టిన వస్తువు పెట్టిన చోట ఉండకపోతే.. ఎన్టీఆర్ కి తెగ కోపం వస్తుందట. అందుకే ప్రణతి ముందుగానే లేచి అన్నీ సరిగా ఉన్నాయో లేదో అని జాగ్రత్తలు తీసుకుంటుంది అని తారాక్ చెప్పాడు.

అంతేకాకుండా.. తన ముద్దుల కొడుకు అభయ్ రామ్ గురించి కూడా చెప్తూ తెగ మురిసిపోయాడు తారాక్. ఇంతకుముందు కంటే.. ఇప్పుడు కొడుకుతో క్లోజ్ గా ఉంటున్నాడట. అంతేకాదు తనని ఆడిస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నాడట. కొడుకుని చూడకుండా ఒక్క రోజు కూడా ఉండలేకపోతున్ననని ఎన్టీఆర్ అంటున్నాడు. ఎంత పెద్ద స్టార్ అయినా పిల్లల ప్రేమకి వాళ్ళ చిరునవ్వులకి ఫిదా అవ్వాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -