ఎన్టీఆర్ ఫ్యాన్స్ పోర్న్ స్టార్ అంటూ తిడుతున్నారు : మీరా చోప్రా

759
jr Ntr Fans Vulgar Posts On Meera Chopra
jr Ntr Fans Vulgar Posts On Meera Chopra

పవన్ కళ్యాణ్‌ నటించిన ‘బంగారం’ సినిమాలో ఎగిరే చిలకమ్మా.. నా రంగుల మొలకమ్మా అనే సాంగ్ గుర్తు ఉండే ఉంటుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా మీరా చోప్రా నటించింది. సినిమా దాదాపుగా ఈమె చూట్టే తిరుగుతోంది. ఆ తర్వాత ఈ భామ వాన సినిమాలో నటించింది. తర్వాత మారో, గ్రీకువీరుడు లాంటి చిత్రాల్లో నటించింది కాని ఈమెకు పెద్దగా సక్సెస్ లు రాలేదు. అయితే ప్రస్తుతం ఆమె మొగలిపువ్వు అనే చిత్రంలో నటిస్తోంది.

ఇది పక్కన పెడితే.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ తనని వేధిస్తున్నారంటూ సోషల్ మీడియాలో షాకింగ్ ట్వీట్ చేసింది మీరా చోప్రా. సోషల్ మీడియాలో యాక్టివ్‌‌గా ఉండే మీరా చోప్రా… ట్విట్టర్‌లో అభిమానులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా తెలుగులో మీ అభిమాన హీరో ఎవరని ఆమెను ఓ నెటిజన్ ప్రశ్నించగా.. మహేష్ బాబు అని మొహమాటం లేకుండా చెప్పింది మీరా.. అయితే మరి మా ఎన్టీఆర్ సంగతి ఏంటని మరో నెటిజన్ అడగ్గా… తాను ఎన్టీఆర్ ఫ్యాన్‌ని కాదని.. ఎన్టీఆర్ కంటే మహేష్ బాబు అంటేనే ఎక్కువ ఇష్టం అని చెప్పడంతో ఎన్టీఆర్ అభిమానులకు కోపం వచ్చింది.

దాంతో మీరా చోప్రాను అసభ్యకరమైన పదాలతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. పచ్చి బూతులు తిట్టారు. దీంతో మీరా చోప్రా ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ‘ఎన్టీఆర్ ఫ్యాన్స్ తనను వేశ్య, పోర్న్ స్టార్ వంటి దారుణమైన పదాలతో పిలుస్తారని ఊహించలేదని… కేవలం ఎన్టీఆర్ కంటే మహేష్ బాబునే ఎక్కువ ఇష్టపడతానని చెప్పడం వల్ల తనను అసభ్యకరమైన రీతిలో తిడుతున్నారని వాపోయింది మీరా చోప్రా. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ని ట్యాగ్ చేస్తూ.. ‘మీ అభిమానులు నా తల్లిదండ్రులకు కూడా ఇలాంటి అసభ్యకరమైన సందేశాలు పంపుతున్నారు.

ఇటువంటి అభిమానులతో మీరు సక్సెస్ సాధించినట్టు భావిస్తున్నారా అని ఎన్టీఆర్‌ని ప్రశ్నించింది మీరా చోప్రా. తన ట్వీట్‌పై ఎన్టీఆర్ తప్పకుండా స్పందిస్తారని ఆశాభావం వ్యక్తం చేసింది మీరా. ఈ ట్వీట్‌కి మహేష్ బాబుని కూడా ట్యాగ్ చేసింది మీరా. అయితే ఈ ఇష్యూపై స్పందించిన సింగర్ చిన్మాయి.. సైబర్ క్రైమ్‌కి కంప్లైంట్ చేయమని సలహా ఇవ్వడంతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేసింది మీరా చోప్రా. అంతేకాకుండా తనని తిట్టిన స్క్రీన్ షాట్స్‌ని షేర్ చేసింది.

Loading...