షూటింగ్స్ లేక.. టీచర్ గా మారిపోయిన ఎన్టీఆర్..!

642
Jr NTR Turned Full Time Cook For His Family
Jr NTR Turned Full Time Cook For His Family

మూడు నెలల నుంచి షూటింగ్స్ లేకపోవడంతో స్టార్ హీరోలు ఇంట్లోనే ఉంటూ తమ పిల్లలతో టైం స్పెండ్ చేస్తున్నారు. మహేష్, అల్లు అర్జున్ వారి పిల్లలతో సరదగా గడుపుతున్న ఫోటోలు, వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ ప్రస్తుతం తన ఇద్దరు కొడుకులతో ఫూర్తి సమయంను గడుపుతున్నాడట. వారు పుట్టినప్పటి నుండి కూడా షూటింగ్స్ తో బిజీ బిజీగా గడిపిన ఎన్టీఆర్ ఎట్టకేలకు వారి కోసం టైం స్పెండ్ చేస్తున్నారు.

ఎన్టీఆర్ కు కుకింగ్ అంటే ఇష్టం. అందుకే ఈ లాక్ డౌన్ లో అమ్మ, భార్య పిల్లలకు ఎన్టీఆర్ వండి పెడుతున్నాడట. ఇదే టైంలో తన ఇద్దరు పిల్లలకు కూడా టీచర్ గా మారిపోయి తెలుగు పాఠాలతో పాటు పలు విషయాలను నేర్పిస్తూ ఉన్నాడట. తన తాత నందమూరి తారక రామారావు సినిమాలను వారితో కలిసి చూస్తూ వారికి తెలుగుపై పట్టు కల్పించేలా ప్రయత్నాలు చేస్తున్నాడట. మొత్తానికి ఎన్టీఆర్ ఈ ఫ్రీ టైం ను ఎక్కువగా పిల్లలకు కేటాయిస్తున్నట్లుగా ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అన్ని పరిస్థితిలు సెట్ అయ్యి షూటింగ్స్ పూర్తి స్థాయిలో మొదలు అయితే ఎన్టీఆర్ మళ్లీ సినిమాలతో బిజీ కాబోతున్నాడు.

ఆర్ఆర్ఆర్ చిత్రం షూటింగ్ పూర్తి అవ్వగానే లేదా అంతకు ముందే త్రివిక్రమ్ తో సినిమాను చేయబోతున్నాడు. వచ్చే ఏడాదిలో అంతా బాగుంటే ఎన్టీఆర్ రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ఛాన్సు ఉంది. ఇక త్రివిక్రమ్ సినిమా అయిపోగానే కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా చేయాల్సి ఉంది. సో రెండేళ్ళ వరకు ఎన్టీఆర్ చాలా బిజీగా ఉన్నాడు. అందుకె ఈ ప్రీ టైంను ఎన్టీఆర్ పిల్లలకు కేటాయించడం మంచి నిర్ణయం అని ఫ్యాన్స్ అంటున్నారు.

మద్యం కొంటున్న అమ్మాయిల్ను వీడియోలు తీస్తే తన్నండి : శ్రీరెడ్డి

రణం హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా ?

పంచెకట్టులో అదరగొట్టిన సూరేఖా ఆంటీ..!

హీరో అవ్వడం నా కొడుకుకి ఇంట్రెస్ట్ లేదు : రేణు దేశాయ్

Loading...