మోక్షజ్ఞ లుక్ గురించి ట్రోల్.. మధ్యలోకి ఎన్టీఆర్ ను లాగారు..!

933
jr ntr vs mokshagna
jr ntr vs mokshagna

నందమూరి నటసింహం బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ హీరోగా ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మోక్షజ్ఞ ఎంట్రీ కోసం మంచి స్టోరీ రెడీ చేయించానని.. తథాస్తు దేవతలు ఒక్కసారి దీవించగానే వెంటనే లాంచ్ చేసేస్తానని బాలయ్య చెప్పాడు. అయితే ఇటివలే బాలకృష్ణ తన 60వ పుట్టినరోజు వేడుకల్ని కుటుంబ సభ్యుల సమక్షంలో జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ వేడుకలో మోక్షజ్ఞ కూడా దర్శనమిచ్చాడు.

ఇతని లుక్ చూసి నందమూరి అభిమానులు షాక్ అయ్యారు. మోక్షజ్ఞ కు హీరో అయ్యే ఇంట్రెస్ట్ లేదా అన్న డౌట్ అందరిలో కలిగింది. ఇలా అయితే హీరోగా మెప్పించడం కష్టమే అంటూ అందరు కామెంట్స్ చేశారు. అయితే మరికొందరు మోక్షజ్ఞకు మద్దతుగా నిలబడడానికి ప్రయత్నించారు. ‘ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎన్టీఆర్ కూడా అంతే కదా..! లావుగా ఉండేవాడు..తరువాత సన్నబడ్డాడు. మోక్షజ్ఞ కూడా అలాగే సన్నబడతాడేమో’ అని కొంతమంది కామెంట్స్ చేసారు.

అయితే ఈ కామెంట్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి నచ్చలేదు. ఎప్పుడో ఎన్టీఆర్ లుక్ గురించి ఇప్పుడు మాట్లాడటం ఏమిటి ? అప్పటి విషయం వేరు.. ఇప్పుడు ఎలా ఉన్నారు అనేది ముఖ్యం అంటూ ఘాటు సమాధానాలు ఇచ్చారు. అయితే ఎన్టీఆర్ 17 ఏళ్ళ వయసుకు హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అతని లాంచింగ్ కు ఎటువంటి హడావుడి చెయ్యలేదు. కానీ బాలయ్య కొడుకుని లాంచ్ చెయ్యడానికి కచ్చితంగా పెద్ద వేడుక నిర్వహించాల్సి ఉంటుంది. కాబట్టి మోక్షజ్ఞ ఫిట్ నెస్ మెయింటైన్ చెయ్యాల్సిన అవసరం కచ్చితంగా ఉందని అంటున్నారు.

దర్శకుడి కొడుకుతోనే అనుష్క పెళ్లి.. నిజమే..?

షూటింగ్స్ లేక.. టీచర్ గా మారిపోయిన ఎన్టీఆర్..!

బాలీవుడ్ లో ఎదగాలంటే ఇలా చేయాల్సిందే : శ్రద్ధాదాస్

మళ్లీ డ్యాన్స్‌తో పిచ్చెక్కించిన ప్రగతి ఆంటీ (వీడియో)

Loading...