Thursday, April 25, 2024
- Advertisement -

కమల్ హాసన్ కి షాక్ ఇవ్వబోతున్న కాజల్

- Advertisement -

భారతీయుడు 2.. తెలుగు సినిమా పరిశ్రమ లో వచ్చే ఏడాది విడుదల అవ్వాల్సిన చిత్రం. అన్నీ అనుకుంటే ఈ సినిమా ఈ పాటికి సగానికి పైగా షూటింగ్ ముగించుకొని ఉండేది కానీ కొన్ని అనివార్య కారణాల వలన ఈ సినిమా షూటింగ్ ఇంకా 20 శాతం కూడా పూర్తి కాలేదు. శంకర్ దర్శకత్వం లో కమల్ ప్రధాన పాత్ర లో ఈ సినిమా అప్పట్లో వచ్చిన భారతీయుడు కి కొనసాగింపు గా వస్తుంది. అయితే దర్శకుడికి నిర్మాత కి కొన్ని అభ్యంతరాలు, అభిప్రాయం భేదాలు వలన ఈ సినిమా ముందుకు వెళ్లడం లేదు.

ఈ సినిమా ఆఫర్ రాగానే ఎగిరి గంతేసి కాజల్ అగర్వాల్ ఇప్పుడేమో ఈ సినిమా కి తను ఇచ్చిన కాల్ షీట్స్ ఉపయోగపడకుండా అవుతున్నాయి అని బాధ పడుతుంది అంట. భారతీయుడు సినిమా అప్పట్లో అవినీతి పైన పెద్ద యుద్ధమే చేసింది. ఇప్పుడు ఈ సినిమా కి కొనసాగింపు అనగానే సినిమా మీద ఉన్న ఆశలు,అంచనాలు పెరిగిపోయాయి.

అయితే ఈ సినిమా మళ్ళి ఎప్పుడు పట్టాలు ఎక్కుతుంది అనే విషయం మీద క్లారిటీ లేకపోవడం తో ఇక సినిమా నుండి వైదొలగాలి అనే నిర్ణయం తీసుకుంది అంట కాజల్. ఒక పక్క కమల్ మాత్రం బిగ్ బాస్ తిరిగి ప్రారంభం చేస్తున్నాడు. కాజల్ మాత్రమే ఈ సినిమా కోసం ఎదురు చూస్తూ కొత్త సినిమాలు చేయడం లేదు. ఇక వేచి చూసే ధోరణి లో ఉంటె కష్టమే అని అర్ధం చేసుకున్న కాజల్ ఇక ప్రాజెక్ట్ నుండి బయటకు రానుంది అని టాక్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -