కాజల్ నడుము గిల్లిన హీరో.. సోషల్ మీడియాలో న్యూస్ వైరల్..!

879
Kajal Aggarwal molested by drunk Tamil actor
Kajal Aggarwal molested by drunk Tamil actor

టాలీవుడ్, కోలీవుడ్ లో టాప్ హీరోలందరి సరసన నటించి స్టార్ హీరోయిన్ గా పేరు సంపాధించుకుంది కాజల్ అగర్వాల్. బాలీవుడ్ లోనూ సత్తా చాటే ప్రయత్నం చేసింది. కాకపోతే అక్కడ ఆశించినంత పేరు రాలేదు. అయితే తన కెరీర్ లో ఈ భామ ఏ హీరోతో కూడా ప్రేమ, ఎఫైర్ అంటూ షికార్లు చేసింది లేదు. సహ జీవనాల జోలికి వెళ్లింది లేదు.

ప్రస్తుతం కేరీర్ చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో పెళ్లి చేసుకుని స్థిరపడిపోవడమే ఆలస్యం అనే కథనాలు వినిపిస్తున్నాయి. అప్పట్లో ఓ బిజినెస్ మ్యాన్ తో లవ్ లో పడిందన్న రూమర్ ఒక్కటే అందరికీ తెలిసింది. కానీ అవన్ని రూమర్లని తెలింది. ఎందులోనూ నిజం లేదని కాజల్ స్పష్టం చేసింది. అయితే ఊహించని ఓ ఘటన మాత్రం కాజల్ కెరీర్ లో ఎప్పటికీ ఓ చేదు గుళిక అనే చెప్పాలి. అప్పట్లో ఓ తమిళ సినిమా షూటింగ్ లో కాజల్ లైంగిక వేధింపులకు గురైనట్లు ఓ వార్త హల్ చల్ చేసింది.

ఓ స్టార్ హీరోతో కలిసి షూటింగ్ చేస్తున్నప్పుడు సదరు హీరో తాగొచ్చి కాజల్ నడుమును గట్టిగా పట్టుకుని ఇబ్బందికి గురి చేసినట్లు కోలీవుడ్ సహా టాలీవుడ్ మీడియాలో ప్రముఖంగా ప్రచారమైంది. వెబ్ సహా మెయిన్ స్ట్రీమ్ మీడియా సైతం అప్పట్లో ఈ న్యూస్ ని బాగా ఫోకస్ లోకి తెచ్చింది. అదే పనిగా సదరు హీరో కాజల్ నడుమును కావాలనే గట్టిగా పట్టుకుని విడిచి పెట్టలేదని చివరికి కాజల్ వ్యక్తిగత అసిస్టెంట్ ముందుకెళ్లి ఆ పిడికిలిని విడిపించాల్సొచ్చిందని ప్రచారం సాగింది. దాంతో ఆ షూటింగ్ నుంచి కాజల్ వెళ్లిపోయిందని దాంతో షూటింగ్ కొన్ని నెలల పాటు ఆగిపోయిందని ప్రచారం సాగింది.

అటుపై ఆ సినిమా ప్రచారంలో భాగంగా కాజల్..సదరు హీరో మళ్లీ కలిసిపోయారని.. కలిసి ఆ సినిమాని ప్రచారం చేయడంతో సీన్ అర్ధమైంది! అంటూ ప్రముఖంగా కథనాలొచ్చాయి. అయితే తాజాగా అవన్నీ రూమర్లనేని తాజాగా అదే మీడియా సంస్థ వెల్లడించడం ఆసక్తికరంగా మారింది. మాములుగానే సోషల్ మీడియాలో కాస్త జరిగితే కొండంత చేసి చూపించడం తెలిసిందే. కాజల్ విషయంలో కూడా అదే జరిగింది.

Loading...