తల్లిదండ్రుల గురించి షాకింగ్ విషయాలు చెప్పిన కళ్యాణి..!

4977
kalyani priyadarshan family
kalyani priyadarshan family

మాములుగా అయితే ఎవరు కూడా తమ పర్సనల్ విషయాలను.. ఫ్యామిలీ విషయాల గురించి ఎక్కడ స్పందించారు. సెలబ్రిటీలు కూడా అంతే. కానీ అఖిల్ సరసన నటించిన కళ్యాణి ప్రియదర్శన్ మాత్రం అలాంటి ఇబ్బంది పడకుండా తన కుటుంబ విషయాలని చాలా ఓపెన్ గా.. ధైర్యంగా చెప్పుకొచ్చింది. ’హలో’ సినిమాతో ఈ భామ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత చిత్రలహరి, రణరంగం వంటి సినిమాల్లో కూడా నటించింది.

ప్రస్తుతం కోలీవుడ్ లో శివ కార్తికేయన్ సరసన ’హీరో’ అనే సినిమాలో నటిస్తోంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె తల్లి దండ్రులు విడాకుల విషయంపై ప్రశ్నలు ఎదురయ్యాయి. కళ్యాణి తల్లిదండ్రులు అయిన ప్రియదర్శన్, నటి లిజీ 1990లో వివాహం చేసుకున్నారు. 25 ఏళ్ళ పాటు కొనసాగిన వీరి వివాహ బంధానికి 2016 సంవత్సరంలో బ్రేక్ పడింది. కొన్ని మనస్పర్థలు కారణంగా లిజీ, ప్రియదర్శన్ విడాకులు తీసుకున్నారు.

ఈ విషయంపై కళ్యాణి ప్రియదర్శన్ స్పందిస్తూ.. “నా తల్లిదండ్రులు విడిపోవడం నాతో పాటు మా ఫ్యామిలీకి కూడా పెద్ద షాక్ అనే చెప్పాలి. అయితే మా కుటుంబంలో ప్రశాంతత, సంతోషం మాత్రం అలాగే ఉన్నాయి. మా అమ్మా, నాన్నా విడిపోవడం మమ్మల్ని ఎంతో బాధ పెట్టింది కానీ ఆ ప్రభావం కుటుంబంపై ఎంతమాత్రం పడలేదు. వారి మధ్య ఉన్న గొడవలు మమల్ని ఇబ్బంది పెట్టలేదు. పెట్టరు కూడా..! ఆ విషయంలో వారికి థాంక్స్ చెప్పాలి. ఇప్పటికీ నాతో వాళ్లిద్దరూ చాలా బాగుంటారు. నాకు ఎలాంటి అవసరం వచ్చినా వారు వెంటనే నా దగ్గరకు వచ్చేశారు” అంటూ చెప్పుకొచ్చింది.

Loading...