Thursday, April 18, 2024
- Advertisement -

కమల్ కి దూరమవుతున్న స్టార్ దర్శకుడు

- Advertisement -

గత ఏడాది బిగ్ బాస్ తమిళ్ రెండో సీజన్ ఫైనల్ ఎపిసోడ్ సందర్భం గా కమల్ హాసన్ భారతీయుడు 2 సినిమా చేస్తున్నట్టు ప్రకటించాడు. అదే వేదిక పైన దర్శకుడు శంకర్ మరియు నిర్మాత దిల్ రాజు లని కూడా కమల్ పరిచయం చేశారు. కొన్ని రోజులు ప్రీ ప్రొడక్షన్ చేసాక దిల్ రాజు ప్రాజెక్ట్ నుండి బయటకు వచ్చారు. ఆ తర్వాత ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ సినిమా ని టేక్ ఓవర్ చేసుకున్నట్లు తెలిసిందే, అయితే అనూహ్యంగా సినిమా షూటింగ్ మొదలయ్యాక మధ్యలో ఆగిపోవడం చాలా బాధ కలిగించే విషయం.

ఇకపోతే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరగడం లేదు. కనీసం సినిమా గురించి మాట్లాడే వాళ్ళు కూడా కరువయ్యారు. అటు కమల్ హాసన్ బిగ్ బాస్ మూడో సీజన్ తో బిజీ అయిపోయారు. శంకర్ మాత్రం ఏం చేయాలో తెలియక తదుపరి ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తున్నారు. అయితే ఆయన క్రమక్రమంగా కమల్ హాసన్ కి దూరం అవుతున్నారట.

తమిళ స్టార్ హీరోలు విక్రమ్ కుమారుడు ధృవ్ ని, విజయ్ కుమారుడు జాసన్ విజయ్ ని పెట్టి ఒక సినిమా తీయాలనే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇందులో ఎంత వరకు వాస్తవం ఉంది అనే విషయం మాత్రం తెలియాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -