Friday, March 29, 2024
- Advertisement -

దిశా రేప్‌కి.. మాతృభాషకి ఏంటీ : పవన్ పై కామెంట్స్

- Advertisement -

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మరో సారి ఘాటు కామెంట్స్ చేశారు సినీ విశ్లేషకుడు కత్తి మహేష్. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాయలసీమలో పర్యటిస్తూ.. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై సంచలన కామెంట్స్ చేస్తూ రాజకీయ వర్గాల్లో వేడిపుట్టిస్తున్నారు.

అయితే ఈ పర్యటన సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై హాట్ టాపిక్ నడుస్తోంది. దిశ ఘటనతో ముడి పెడుతూ జగన్ పాలనను ప్రశ్నించడంపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. ఈ సందర్భంలో “ఆడపిల్లలపై అఘాయిత్యాలకు మాతృభాష నిర్లక్ష్యమే కారణం’ అని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల్ని తప్పు పడుతూ నిప్పులు చెరిగారు కత్తి మహేష్. ‘మాతృభాషకి దిశ రేప్‌కి లింకేందిరా నాయనా.. వామ్మో… వాయ్యో! ఈ సోదిగాడికి పిచ్చి పట్టిందిరో’ అంటూ ఫేస్ బుక్‌లో పవన్‌ను ఉద్దేశించి పోస్టు పెట్టారు కత్తి.

“క్రిస్టియానిటీని పాటిస్తే, కులం ప్రస్తావన ఉండదు” అని పవన్ కళ్యాణ్ అంటున్నారని.. అతను కరెక్ట్‌గా ఆరెస్సెస్ బీజేపీ వాళ్ళ మాటలు మాట్లాడావ్. ఈ దేశంలో ఎవరు ఏమతాన్ని నమ్మినా, అందరూ నిజంగా నమ్మేది కులమేరా సోదినాయాలా’ అంటూ పవన్‌కు కౌంటర్ ఇచ్చారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -