ఎమ్మెల్యేపై మోజు ప‌డ్డ విజ‌య్ దేవ‌ర‌కొండ‌…?

1961
Kethrin next heroine in vijay devarakonda movie
Kethrin next heroine in vijay devarakonda movie

టాలీవుడ్ సన్సేష‌న‌ల్ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ గ‌త సంవ‌త్స‌రం మూడు సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు. గీతా గోవిందం,నోటా,టాక్సీవాలా సినిమాల‌ను విడుద‌ల చేశాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. వీటిలో గోవిందం,,టాక్సీవాలా సినిమాలు విజ‌యం సాధించాయి. ఇక సంవ‌త్స‌రం ‘డియ‌ర్ కామ్రేడ్‌’తో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు విజ‌య్‌. డియర్ కామ్రేడ్ వేసవి చివర్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా ర‌ష్మిక మందాన న‌టిస్తోంది. అయితే త‌న త‌రువాత సినిమాలో హీరోయిన్‌గా ఎమ్మెల్యే కావాల‌ని ప‌ట్టుప‌డుతున్నాడ‌ట విజ‌య్ దేవ‌ర‌కొండ‌.

ఎమ్మెల్యే అంటే స‌రైనోడు సినిమాలో ఎమ్మెల్యే క్యారెక్ట‌ర్ చేసిన కేథరిన్‌ను త‌న త‌రువాత సినిమాలో హీరోయిన్‌గా తీసుకోవాల‌ని భావిస్తున్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌.దర్శకుడు క్రాంతి మాధవన్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌నున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా కేథరిన్ ఎంపిక అయింద‌ని స‌మాచారం.. విజయ్ దేవరకొండతో నటించిన రష్మిక మందన ఎంత‌టి క్రేజ్ సంపాదించిందో అంద‌రికి తెలిసిందే. విజ‌య్‌తో న‌టిస్తే కేథరిన్ క్రేజ్ కూడా పెరుగుతుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు విజ‌య్ దేవ‌ర‌కొండ అభిమానులు.