Saturday, April 20, 2024
- Advertisement -

నా భార్యకు ఆ హీరో అంటే పిచ్చి ఇష్టం : సుదీప్

- Advertisement -

కిచ్చా సుదీప్ కన్నడంలో పెద్ద సూపర్ స్టార్. ఆయన తెలుగులో కూడా సినిమాలు చేశాడు. ఈగ సినిమాతో ఇక్కడి ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకున్నాడు. అయితే సుదీప్ భార్య మరో హీరో అంటే పడి చస్తుందట. ఈ విషయం ఎవరో కాదు సుదీపే ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.

సుదీప్ దబాంగ్ 3లో విలన్ గా చేశాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సుదీప్ బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ గురించి మాట్లాడారు. ’నేను హృతిక్ తో సినిమా చేస్తున్నానని తెలుస్తే అందరికంటే ముందు సెట్స్ కు వచ్చేది నా భార్యే. తను హృతిక్ కు పెద్ద ఫ్యాన్. ఆమె కోసమే హృతిక్ నటించిన మొదటి సినిమా కహో నా ప్యార్ హై పది సార్ల కంటే ఎక్కువగా చూశాను. సినిమా తీసుకెళ్లమని నన్ను బెదిరించేది. నేను తీసుకెళ్లకపోతే తన ఫ్రెండ్స్ తో వెళ్లిపోయేది.

నేను ఫస్ట్ టైం ఆ సినిమా చూసినప్పుడు బాగా నచ్చింది. నాకు హృతిక్ డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. అలా ’కహో నా ప్యార్ హై’ నా లైఫ్ లో ఒక భాగం అయిపోయింది’ అని సుదీప్ తెలిపారు. ఇక సల్మాన్ ఖాన్, సుదీప్ నటించిన దబాంగ్ 3 సినిమా క్రిస్మస్ కి రిలీజ్ కానుంది. ఈ సినిమాకి ప్రభుదేవా దర్శకత్వం వహిస్తుండగా.. సోనాక్షి సిన్హా హీరోయిన్ గా నటిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -