క్రికెటర్‍తో వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లి ?

1763
Kollywood Heroine Marrying Crickter
Kollywood Heroine Marrying Crickter

సినీ తార పెళ్లి వార్తలు ఫ్యాన్స్ కి ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. ఇప్పటికే నిఖిల్, దిల్ రాజు పెళ్లిలు అయిపోగా.. లైన్ లో నితిన్, రానా ఉన్నారు. వీరి పెళ్లి కూడా ఈ ఏడాదే ఉండబోతుంది. తాజాగా వరలక్ష్మీ శరత్ కుమార్ పెళ్లి వార్త మీడియాలో దూసుకొచ్చింది. విషయంలోకి వెళ్తే.. వరలక్ష్మీ, హీరో విశాల్ మధ్య అఫైర్, డేటింగ్ వార్తలు గతంలో వచ్చాయి.

పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు గుప్పుమన్నాయి. అయితే వారిద్దరి మధ్య ఏం జరిగిందో కానీ.. మా మధ్య అలాంటి బంధమే లేదు అని వరలక్ష్మీ క్లారిటీ ఇచ్చేసింది. కొద్ది రోజులుగా సింగిల్ ఉంటున్న వరలక్ష్మీ ఇటీవల ప్రేమలో పడిందనే వార్త తమిళ మీడియాలో కనిపించింది. అతను భారతీయ క్రికెట్‌కు సంబంధించిన వ్యక్తి అనే విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఆ వ్యక్తితో పీకల్లోతు ప్రేమలో ఉందట వరలక్ష్మీ. వారిద్దరు పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చారట.

తమ ప్రేమ ప్రతిపాదనకు ఇరు కుటుంబాల నుంచి వీరిద్దరి ప్రేమకు ఆమోదం లభించినట్టు సమాచారం. అయితే వరలక్ష్మీకి కాబోయే భర్త క్రికెటర్లు ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీకి అత్యంత స్నేహితుడనే విషయం బయటకు వచ్చింది. అయితే ఆ వ్యక్తి పేరు మాత్రం చాలా సీక్రెట్‌గా పెట్టడం అనేక సందేహాలకు తావిస్తుంది. లాక్‌డౌన్ తర్వాత పెళ్లి జరిపించాలనే ఆలోచనలో ఇరు కుటుంబాలు ఉన్నాయట. అయితే ఈ వార్తలపై వరలక్ష్మీ ఇప్పటి వరకు స్పందించలేదు. మరి ఈ వార్తలు ఎక్కువ అవుతుండటంతో వరలక్ష్మీ ఎప్పుడు స్పందిస్తుందో చూడాలి.

Loading...