Saturday, April 20, 2024
- Advertisement -

మెగాస్టార్ 152 కథ లీక్.. ఫ్యాన్స్ కి గూస్ బంప్స్..!

- Advertisement -

టాలీవుడ్ లో ప్రస్తుతం కొరటాల శివకు మంచి పేరు ఉంది. అతను చేసిన సినిమాలన్ని సూపర్ హిటే. అది కూడా స్టార్ హీరోలతో సినిమాలు చేసి సూపర్ హిట్ అందుకున్నాడు. స్టార్ హీరోలతో సినిమాలు చేయడం అంత ఈజీ కాదు. స్టార్ హీరోలకు కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండేలా సినిమాని రూపొందించాలి. ఈ విషయంలో కొరటాల సక్సెస్ అయ్యాడని చెప్పాలి. ఆయన భరత్ అనే నేను సినిమా తర్వాత మెగాస్టార్ చిరుతో సినిమాకి రెడీ అయ్యాడు. ఇటీవలే ఈ సినిమా సంబంధించి పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి.

అయితే చిరు కొరటాల కాంబోలో వస్తున్న ఈ సినిమా కథ ఇదే అంటూ సోషల్ మీడియాలో రూమర్స్ వస్తున్నాయి. ఈ చిత్రంలో మెగాస్టార్ దేవాదాయ ధర్మాదయ శాఖ ఉద్యోగి పాత్రలో కనిపిస్తారని టాక్. ఎండోమెంట్ డిపార్ట్ మెంట్ లో జరిగే అవినితీ వల్ల.. దేవదాయాలను నిర్లక్ష్యం చేయడం వల్ల సమాజనికి జరిగే హానీ గురించి ఈ మూవీలో చర్చిస్తారట. అయితే దేవాదాయ శాఖ అంటే రాజకీయ నేతలు దేవాలయాల భూములను ఆక్రమిస్తున్నారు.

అలాంటి వారి భరతం ఈ సినిమాలో చిరు పడతాడని అంటున్నారు. వాస్తవానికి ఇది పెద్ద ఇష్యూనే. ఏ దర్శకుడు ఇలాంటి ఇష్యూపైన సినిమాలను తెరకెక్కించలేదు. సో ఇప్పుడు ఇలాంటి థీమ్ తోనే కొరటల, చిరు కాంబోలో సినిమా వస్తోంది. కమర్షియల్ ఎలిమెంట్స్ చూపిస్తూనే ఓ మంచి మెసేజ్ ఈ సినిమా ద్వారా చెప్పనున్నారట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -