పుష్ప లో వైసీపీ ఎమ్మెల్యే రోజా..!

934
lady villain in allu arjuns pushpa movie
lady villain in allu arjuns pushpa movie

అల వైకుంఠపురలో తో ఇండస్ట్రీ హిట్ అందుకున్న అల్లు అర్జున్.. ఇప్పుడు సుకుమార్ డైరెక్షన్ లో పుష్పా సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది. శేషాచలం అడవులలో జరిగే రెడ్ శాండిల్ అక్రమ రవాణా నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కుతుండగా.. అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా నటిస్తున్నాడు.

అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త హల్ చల్ చేస్తోంది. ఈ మూవీలో విలన్ పాత్ర కోసం ఒకప్పటి హీరోయిన్ వైసీపీ ఫైర్ బ్రాండ్ ఎం ఎల్ ఏ రోజాని తీసుకుంటున్నారట. ఓ పవర్ ఫుల్ లేడీ విలన్ రోల్ కోసం ఆమెను సంప్రదించగా ఆమె ఒకే కూడా చెప్పారని వార్తలు వస్తున్నాయి. ఇక బన్నీ పాత్రకు సవాలు విసిరే క్రూయల్ లేడీ విలన్ గా ఈమె పాత్ర ఉండే అవకాశం కలదట. మరి ఇదే కనుక నిజం అయితే పుష్ప సినిమాకు అదనపు ఆకర్షణ చేకూరినట్టే.

ఇక గతంలో రోజా కొన్ని సినిమాలో విలన్ రోల్స్ కూడా చేశారు. గోపి చంద్ హీరోగా కృష్ణ వంశీ తెరకెక్కించిన మొగుడు సినిమాలో ఆమె విలన్ రోల్ చేశారు. రవితేజ, అల్లరి నరేష్ ల మల్టీస్టారర్ శంభో శివ శంభో చిత్రంలో కూడా ఆమె విలన్ పాత్ర చేయడం జరిగింది. ఈ వార్తలో స్పష్టత రావాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మీక హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది.

బ్రాహ్మణి రాజకీయాల్లోకి రావడంపై బాలయ్య స్పందన..!

చిరు వర్సస్ బాలయ్య ఇష్యూపై ప్రకాష్ రాజ్ కామెంట్స్..!

రాజకీయాల్లోకి అనసూయ.. మాములు ట్విస్ట్ కాదు ఇది..!

మహేష్ టాటూ వెనుకున్న మ్యాటర్ ఇదే..!

Loading...