కీర్తి పెళ్లి ఫిక్స్ అయిందా ? అబ్బాయి అతనేనా ?

994
Mahanati Actress To Marry A Businessman
Mahanati Actress To Marry A Businessman

తెలుగు తెరకు ‘నేను శైలజ’ సినిమాతో పరిచయమైంది మలయాళ నటి కీర్తి సురేష్. సావిత్రి బయోపిక్ ‘మహానటి’ చిత్రంలో ఆమె అభినయంతో కోట్లాది మంది అభిమానులను సంపాధించుకుంది. ఈ సినిమాలో నటనకు గాను జాతీయ ఉత్తమ నటి అవార్డును కూడా అందుకుంది. అయితే కీర్తి సురేష్ త్వరలో పెళ్లి చేసుకోబోతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. తల్లిదండ్రులు కుదిర్చిన సంబంధాన్ని కీర్తి సురేష్ చేసుకోబోతున్న విషయం చర్చనీయాంశంగా మారింది.

కెరీర్ మంచి స్థాయిలో కొనసాగుతున్న టైంలో కీర్తి పెళ్లి చేసుకోవడం ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కేరళ బీజేపీ పార్టీలో కీలకంగా కొనసాగుతున్న ఓ వ్యాపారవేత్త కుమారుడితో పెళ్లికి సంప్రదింపులు జరుగుతున్నాయని ఆ సంబంధాన్ని ఖాయం చేసే పనిలో ఆమె తల్లిదండ్రులు ఉన్నారని వార్తలు వస్తున్నాయి. పెళ్లి కుమారుడి తండ్రితో కీర్తీ తండ్రికి మంచి స్నేహపూర్వక సంబంధాలు ఉండటంతో ఈ పెళ్లి ఫిక్స్ అయిందని సినీ రాజకీయ ప్రముఖులు అభిప్రాయ పడుతున్నారని కొన్ని పత్రికలు రాశాయి. అయితే ఈ వార్తలపై కూడా కీర్తి ఎక్కడ స్పందించకపోవడంతో ఈ వార్తలు నిజమే అని కొందరు నమ్ముతున్నారు.

ఇక ఈ విషయంపై కీర్తి తల్లి దండ్రులు కూడా అధికారికంగా ఎక్కడ మాట్లాడలేదు. అయితే కీర్తి పెళ్లి వార్తలపై ఆమె సన్నిహిత వర్గాలు మాత్రం కొట్టిపడేస్తున్నారు. ప్రస్తుతం ఆమె పూర్తిగా కెరీర్ పైనే దృష్టి పెట్టారని పెళ్లి ఇప్పట్లో లేదని.. అంటున్నారు. ఇక ప్రస్తుతం కీర్తి రజనీకాంస్ సినిమాలో అలానే కార్తీక్ సుబ్బరాజు ‘పెంగ్విన్’ మోహన్లాల్ నటిస్తున్న ‘మరక్కార్ అరబికదలింటే సింహం’ తెలుగులో ‘మిస్ ఇండియా’ ‘రంగ్ దే’ చిత్రాల్లో నటిస్తున్నారు.

Loading...