రాముడిగా మహేష్ బాబు.. న్యూస్ వైరల్.. చూడండి..!

1945
mahesh babu as rama
mahesh babu as rama

టాలీవుడ్ లో మహేష్ బాబుకు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికి తెలిసిందే. ఆయన సినిమా వస్తుందంటే రికార్డుల వర్షం కురవాల్సిందే. ఏ సినిమా చేసిన అందులో ప్రత్యేకమైన మెసేజ్ ఉండేలా చూసుకుంటాడు మహేష్ బాబు. అందుకే అయనకు ఆ రేంజ్ క్రేజ్. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోగా కొనసాగుతున్న మహేష్ బాబు వరస విజయాల్లో ఉన్నాడు.

మహర్షి సినిమా తర్వాత సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించి బ్లాక్ బాస్టర్ కొట్టాడు. అలానే ప్రస్తుతం కొత్త సినిమా చర్చల్లో ఉన్నాడు. అయితే మహేష్ బాబుకు సోషల్ మీడియాలో విపరితమైన ఫాలోయింగ్ ఉంది. తాజాగా మహేష్ అభిమాని ఓ పోస్టర్ ను సోషల్ మీడియాలో పెట్టడంతో అది వైరల్ అయింది. ఇందులో మహేష్ బాబు రాముడిగా కనబడుతున్నాడు. చేతిలో బాణం పట్టుకుని.. కూల్ గా మహేష్ ఉన్నాడు. కరోనా విజృంభణ నేపథ్యంలో లాక్‌డౌన్‌ విధించడంతో షూటింగులు లేకపోవడంతో ప్రస్తుతం మహేశ్ బాబు ఇంట్లోనే ఈ ఖాళీ సమయాన్ని తమ కుటుంబ సభ్యులతో గడుపుతున్నాడు.

ఈ సందర్భంగా ఆయన తన పిల్లలతో తీసుకున్న ఫొటోలు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో అభిమానులను అలరించాయి. ఇక ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత రాజమౌళి మహేశ్ బాబుతో ఓ సినిమా చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. మరి మహేష్ బాబుతో రాజమౌళి ఎలాంటి సినిమా చేస్తాడు అనేది ఆసక్తిగా మారింది. ఒక వెళ మహేష్ బాబుతో రాజమౌళి ’రామాయణం’ సినిమా చేస్తే అందులో మహేష్ బాబు ఎలా ఉంటాడో ఉహిస్తూ ఓ అభిమాని ఈ పోస్టర్ ను రూపొందించాడు. ఈ పోస్టర్ మహేష్ ఫ్యాన్స్ కు విపరితంగా నచ్చడంతో బాగా షేర్ చేస్తున్నారు.

Loading...