తరుణ్ భాస్కర్ ను ట్రోల్ చేస్తున్న మహేష్ అభిమానులు..!

683
mahesh babu fans trolling tharun bhascker
mahesh babu fans trolling tharun bhascker

టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్.. పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది వంటి అద్భుతమైన సినిమాలు తీశాడు. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. పెళ్లి చూపులు సినిమాకి అయితే నేషనల్ అవార్డు కూడా వచ్చింది. తరుణ్ బాస్కర్ కి యూత్ లో మంచి ఫాలోంగ్. అతని సినిమా వస్తుందంటే ఎదురు చూసే వాళ్లు ఉన్నారు. సో ఇండస్ట్రీలో తరుణ్ బాస్కర్ కి మంచి పేరు ఉంది. అయితే గతంలో అవార్డుల విషయమై ఎన్టీఆర్ ‘జనతా గ్యారేజ్’ సినిమా పై కామెంట్స్ చేసి.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి కోపం తెప్పించాడు.

అప్పుడు తరుణ్ బాస్కర్ ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాగా ట్రోల్ చేశారు. ఇప్పుడు టాలీవుడ్ కమర్షియల్ సినిమాల పై నెగిటివ్ కామెంట్స్ చేసి.. సూపర్ స్టార్ అభిమానులకు ఆగ్రహం తెప్పించాడు. విషయంలోకి వెళ్తే.. తరుణ్ భాస్కర్.. మలయాళ మూవీ ‘కప్పెల’ గురించి తన అభిప్రాయాన్ని చెబుతూ తన ఇన్‌స్టాగ్రామ్ లో స్టోరీ పెట్టాడు. “హీరో పిచ్చోడిలా పెద్ద ఎత్తున రీసౌండ్ చేసుకుంటూ అరవడు. అతనే తెలివైనవాడు అన్నట్టు ప్రతి డైలాగ్‌లో సామెత చెప్పడు. ఎక్స్‌ట్రీమ్ స్లో మోషన్లో ఫిజిక్స్ ఫెయిలయ్యేలా ఫైట్లు ఉండవు. ప్రతి రెండు నిమిషాలకూ హీరో ఎంట్రీ ఉండదు.

చివరి పది నిమిషాల్లో రాండమ్‌గా రైతుల గురించో, సైనికుల గురించో, దేశం గురించో మెసేజ్ లు ఉండవు. మరి దీన్ని కూడా సినిమా అంటారు ఆ ఊర్లో’’.. అంటూ తరుణ్ తన ఇన్స్టా స్టోరీలో చెప్పుకొచ్చాడు. అయితే టాలీవుడ్ కమర్షియల్ సినిమాల గురించి గట్టి కౌంటర్లే వేసాడు తరుణ్ అని అందరికీ అర్ధమవుతుంది. అయితే చివర్లో ’పది నిమిషాల్లో రైతులు, సైనికులు, దేశం గురించి మెసేజ్ లు ఉండవు’ అని చేసిన కామెంట్స్ ను బట్టి.. మహేష్ సినిమాలు అయిన ‘మహర్షి’, ‘సరిలేరు నీకెవ్వరు’ నే టార్గెట్ చేసాడని క్లియర్ గా అర్దం అవుతోంది. దాంతో మహేష్ ఫ్యాన్స్ తరుణ్ ను బాగా ట్రోల్ చేయడం మొదలు పెట్టారు.

తరుణ్ కూడా వాళ్లకు కౌంటర్ ఇచ్చాడు. అయితే గతంలో పెళ్లి చూపులు సినిమా చూసి మహేష్ ట్విట్ కూడా చేసి ఆ సినిమాని మెచ్చుకున్నాడు. అంతే కాకుండా తరుణ్ హీరోగా చేసిన మీకు మాత్రమే చెప్తా సినిమాకి కూడా మహేష్ సపోర్ట్ చేశాడు. అలాంటి మహేష్ సినిమాలను తరుణ్ బాస్కర్ తీసిపడేయడం అనేది మహేష్ ఫ్యాన్స్ కి అసలు నచ్చడం లేదు.

సుశాంత్ వీడియాలు చూసి ఎమోషన్ అయ్యాను.. : శ్రీరెడ్డి పోస్ట్

బిగ్ బాస్ ఇంట్లో.. అందాల ముద్దుగుమ్మలు వీరే..!

లవ్ మ్యారేజ్ కావాలి.. నాలే అల్లరి చేయాలి : శ్రీముఖి

‘బిగ్ బాస్ – 4’ హోస్ట్ గా సమంత ?

Loading...