తమన్ మాకు వద్దు అంటున్న మహేష్ అభిమానులు..!

2777
mahesh babu fans vs thaman
mahesh babu fans vs thaman

ఈ సంక్రాంతికి వచ్చిన మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’, బన్నీ ‘అల వైకుంఠపురములో’ చిత్రాలు మంచి హిట్లుగా నిలిచాయి. వసూళ్లు కూడా బానే వచ్చాయి. అయితే ‘సరిలేరు’ కంటే ‘అల వైకుంఠపురములో’ చిత్రానికి వసుళ్ళు ఎక్కువగా వస్తున్నాయనే డిస్కషన్ సోషల్ మీడియాలో నడుస్తోంది. సంక్రాంతికి మాస్ సినిమాలు ఉన్నప్పటికి ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ కూడా ఎక్కువగానే ఇష్టపడుతారు.

‘అల వైకుంఠపురములో’ చిత్రానికి మ్యూజిక్ కూడా బాగా ప్లస్ అయ్యింది. అలా అని ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ మంచి ఆడియో ఇవ్వలేదా అంటే .. అది సబబు కాదు. దేవి తనవంతు న్యాయం చేసాడు. కానీ అల వైకుంఠపురములో ఆడియో పెద్ద హిట్ అయింది. అందుకే తమన్ పాటలు ఎక్కువగా ఈ సంక్రాంతికి వినిపిస్తున్నాయి. అలా అని ప్రతీ చిత్రానికి అతను ఇదే స్థాయిలో సంగీతం అందిస్తున్నాడా అంటే కచ్చితంగా అవునని చెప్పలేము.

ఇక అసలు విషయానికి వస్తే.. మహేష్ 27 వ చిత్రం వంశీ పైడిపల్లి డైరెక్షన్లో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి తమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంపికైనట్లు రూమర్స్ వస్తున్నాయి. ఈ విషయం తమన్.. తనే అందరికీ చెప్పుకుంటున్నాడని తెలుస్తుంది. నిజానికి ఈ మూవీకి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడని.. అందులో ఏ మార్పు లేదని కూడా సమాచారం అందుతుంది. ఇటీవలే వైజాగ్ లో జరిగిన ‘అల వైకుంఠపురములో’ సక్సెస్ వేడుకలో ఇండైరెక్ట్ గా ‘సరిలేరు నీకెవ్వరు’ టీం పై సెటైర్లు వేసాడు తమన్.

దీంతో మహేష్ అభిమానులు తమన్ ఆయన పై మండిపడుతున్నారు.’ ‘దూకుడు’ చిత్రానికి మహేష్ ఛాన్స్ ఇచ్చిన సంగతి ఎలా మరిచిపోయావ్ తమన్’. మహేష్ తరువాతి చిత్రానికి తమన్ వద్దు.. దేవి అన్నే కావాలి’ అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

Loading...