Thursday, April 25, 2024
- Advertisement -

నాని కోసం మహేష్ ఏం చేసాడంటే??

- Advertisement -

గత సంవత్సరం 2015లో రిలీజ్ అయిన నాని భలే భలే మగాడివోయ్ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పకర్లేదు. ఈ సినిమా మరో సారి నాని స్థాయిన్ని పెంచి అద్భుతమైన కలేక్షన్లు రాబట్టి రికార్డ్ సృష్టించింది. రీసెంట్‌గా నాని తన కొత్త సినిమా ‘క్రిష్ణగాడి వీర ప్రేమగాథ‘ ఫస్ట్ లుక్ ని ఇటీవలే లాంచ్ చేసారు.

ఈ ఫస్ట్ లుక్‍కి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇదే నెల 18న ఈ సినిమా ఆడియోని విడుదలను గ్రాండ్ చేయబోతున్నారు. హను రాఘవాపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని 14 రీల్స్ సంస్థ నిర్మిస్తుంది. ఐతే ఈ ఆడియో వేడుకకు ముఖ్య అతిధిగా సూపర్ స్టార్ మహేష్ బాబు రాబోతున్నారట.

అవును ఇది నిజమే 14 రీల్స్ సంస్థకు మహేష్ బాబుకు మంచి స్నేహా సంబంధాలు ఉన్నాయి. ఇంతకు ముందు మహేష్ బాబు నటించిన దూకుడు, 1-నేనొక్కడినే, ఆగడు సినిమాలను ఇదే సంస్థ నిర్మించడం వల్ల మహేష్ బాబుని  ‘క్రిష్ణగాడి వీర ప్రేమగాథ‘ ఆడియో పంక్షన్‍కి ముఖ్య అతిధిగా రావాలి అని కోరారట. మహేష్ బాబు కూడా ఓకే అన్నాట్లు సమాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -