Wednesday, April 24, 2024
- Advertisement -

తనకు ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్ తో మళ్ళీ సినిమా కి మహేష్..!!

- Advertisement -

మహేష్ తాను పనిచేసిన ప్రతి డైరెక్టర్ తో రెండో సారి సినిమా చేయడం ఆయనకు అలవాటు.అయితే అలా చేసిన ప్రతిసారి చేతులు కాల్చుకున్నారు మహేష్.. గతంలో గుణ శేఖర్ తో, శ్రీనువైట్ల తో ఇలా వరుసగా సినిమా లు చేసి తప్పు చేశానని అనుకునే లోపు ఇప్పుడు మళ్ళీ అదే తప్పు చేస్తున్నారు మహేష్.. మహేష్ కెరీర్ లో స్పైడర్ సినిమా ఎంత పెద్ద డిజాస్టరో అందరికి తెలిసిందే.. మురుగదాస్ తో చేస్తున్న ఈ సినిమా పై మంచి అంచనాలుండగా ఇది భారీ ఫ్లాప్ అయ్యింది..

ఎంచుకున్న కాన్సెప్ట్ కొద్దిగా బెటర్ అనిపించినా స్క్రీన్ ప్లే దెబ్బేయడంతో సినిమా ఫ్లాప్ అయ్యింది. తమిళంలో ఈ సినిమా కోసం మహేష్ సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నా ఫలితం మాత్రం నిరాశపరచింది.అయితే సాధారణంగా ఫ్లాప్ వస్తే మరోసారి ఆ డైరక్టర్స్ జోలికి స్టార్స్ వెళ్ళరు. కాని మహేష్ మాత్రం ఫ్లాప్ ఇచ్చినా సరే డైరక్టర్ కు మరో ఛాన్స్ ఇస్తున్నాడు. మురుగదాస్ డైరక్షన్ లో మహేష్ హీరోగా మరో సినిమా వస్తుందని లేటెస్ట్ టాక్. స్పైడర్ ఫ్లాప్ అయినా సరే మురుగదాస్ తో మహేష్ సినిమా అంటే రిస్క్ ఏమో కదా అంటున్నారు కొందరు.

మహేష్ ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత మహేష్ మురుగదాస్ తో సినిమా ప్లాన్ చేస్తున్నాడట. ప్రస్తుతం విజయ్ హీరోగా తుపాకి 2 చేస్తున్న మురుగదాస్ ఆ సినిమా తర్వాత మరోసారి మహేష్ తో సినిమా చేస్తాడని తెలుస్తుంది. ఈసారి వీరి కాంబినేషన్ లో పాన్ ఇండియా సినిమా వస్తుందని టాక్.

సొంత సినిమాలు ప్లాప్ అని ఒప్పుకున్న మన హీరోలు వీరే..!

మెగాస్టార్ చిరంజీవి వదిలేసిన సినిమాలు ఇవే..!

మన స్టార్ హీరోలకు ఇష్టమైన ఆహారం ఏంటో తెలుసా ?

మహేష్ వదిలేసిన సూపర్ హిట్ సినిమాలు ఇవే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -