మహేష్ టాటూ వెనుకున్న మ్యాటర్ ఇదే..!

682
Mahesh team planner Dollar Tattoo first
Mahesh team planner Dollar Tattoo first

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం ’సర్కారు వారి పాట’. సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాలోని మహేష్ బాబు ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఫస్ట్ లు కు పోస్టర్.. మహేష్ గెటప్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

ఇక మహేష్ మెడ మీద ఉన్న ఒక రూపాయ పచ్చబొట్టు అందరిని ఆకర్షించింది. ఈ రూపాయి పచ్చబొట్టు ట్రెండ్ గా మారుతుందని.. త్వరలో మహేష్ ఫ్యాన్స్ ఈ పచ్చబొట్టుతో దర్శనిమిస్తారని అంచనాలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ఈ పచ్చబొట్టు గురించి ఓ ఆసక్తికర విషయం వినిపిస్తోంది. మొదట రూపాయ పచ్చబొట్టు అనుకోలేదట.. డాలర్ టాటూ అనుకున్నారట. కారణం ఏంటంటే సినిమా అమెరికా నేపథ్యంలో సాగుతుందట. అయితే మహమ్మారి ప్రబలడం కారణంగా ఇప్పుడు అమెరికాలో షూట్ చెయ్యడం అంత సులువు కాదు. అందుకే కథను ఇండియా నేపథ్యానికి అనుగుణంగా మార్చారట.

అందులో భాగంగా ఆ టాటూ ను రూపాయగా మార్చారట. కారణం ఏదైనా ఈ పచ్చబొట్టు మాత్రం ప్రేక్షకులలో సినిమాపై అంచనాలను పెంచేసింది. మహేష్ బాబు గెటప్ మారడం లేదు.. రొటీన్ గా ఉంటోంది అనే విమర్శలు చేసేవారికి గట్టిగా సమాధానం ఇచ్చారు మహేష్ అని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు.

Loading...