భార్యతో మనోజ్ విడాకులకు అసలైన కారణం ఇదే..!

2232
manchu manoj confirms divorce with wife pranathi reddy
manchu manoj confirms divorce with wife pranathi reddy

ఎవరు ఊహించని విధంగా మంచు కుటుంబంలో ఆశ్చర్యకరమైన సంఘటన చోటు చేసుకుంది. మంచు ఫ్యామిలీ హ్యాపీగా ఉందని అనుకుంటున్న టైంలో టాలీవుడ్ షాక్ అయ్యేలా చేశాడు మనోజ్. తన భార్య ప్రణతితో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. వీరు 2015లో పెళ్లి చేసుకున్నారు. ఇద్దరి మధ్య వచ్చిన విభేదాల కారణంగానే విడాకులు తీసుకున్నట్లు మనోజ్ తెలిపాడు.

ఓ ఫోస్ట్ ద్వారా ఈ విషయంను తెలిపాడు. అయితే వీరు పెళ్లి తర్వాత సంవత్సరం వరకు ్కలిసే ఉన్నారు. ఆ తర్వాత విభేదాలు వచ్చయట. సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు.. వీరిద్దరు 2017 నుంచే విడివిడిగా ఉంటున్నారట. కలిసి ఉన్నది కేవలం ఒక ఏడాది మాత్రమే అని సినీ వర్గాల్లో గుసగుసలాడుకుంటున్నారు. వీరీద్దర్ని కలిసి ఉంచేందుకు ఇరు కుటుంబాలు ఎంత ప్రయత్నాలు చేసిన కుదరలేదట.

మోహన్ బాబు కూడా మంచి చెప్పి చూసిన కుదరలేదట. అయితే ప్రణతి మంచి విద్యావంతురాలు.. అమె ఆమెరికాలో ఉద్యోగం చేస్తూ ఆనందంగా ఉండాలనుకుందని.. అమెరికాకు వెళ్లడానికి మనోజ్ ఒప్పుకోలేదని అందుకే ఇద్దరి మధ్య గొడలు ప్రారంభం అయ్యాయని ఇండస్ట్రీలో రకరకాలుగా అనుకుంటున్నారు. కెరీర్ కోసం ప్రణతి భర్తతో విడాకులు తీసుకుందని అంటున్నారు. మొత్తానికి మనోజ్ లైఫ్ లో జరిగిన ఈ సంఘటన ఆయన ఫ్యాన్స్ ను తీవ్రంగా కలిచి వేస్తోంది. ఇక మనోజ్ తన పూర్తి దృష్టి సినిమాలపైనే ఉంటుందని తెలిపాడు.

Loading...