విడాకులు ఇచ్చినందుకు మనోజ్ పై విమర్శలు..!

902
Manchu Manoj Tweet About Pranathi Reddy
Manchu Manoj Tweet About Pranathi Reddy

మంచు మనోజ్ సినిమాలకు దూరంగా ఉండి చాలా కాలం అవుతుంది. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గానే ఉంటున్నారు కానీ సినిమాల విషయం గురించి చెప్పట్లే. ఇక ఆయన లైఫ్ కు సంబంధించి చాలా కాలంగా నడుస్తున్న సస్పెన్స్ వీడింది. తన భార్య ప్రణతికి విడాకులు ఇచ్చినట్లు వెల్లడించి షాక్ ఇచ్చాడు.

రెండేళ్ల కిందట.. ’ఒక్కడు మిగిలాడు’ సినిమాతో వచ్చిన మనోజ్ ఆ తర్వాత సినిమా చేయలేదు. అలానే తన భార్య ప్రణతితో ఈ రెండేళ్లలో ఎప్పుడు కనిపించకపోవడంతో జనాలకు సందేహాలు కలిగాయి. పండగలప్పుడు కుటుంబ సభ్యులతో ఫోటోలు దిగినపుడు కూడా అతడి పక్కన ప్రణతి లేదు. దీంతో ప్రణతి, మనోజ్ కి మధ్య విభేధాలు వచ్చాయని ప్రచారం జరిగింది. గత ఏడాదే మనోజ్ విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. దీనీపై ఓ యూట్యూబ్ చానెల్ లో స్టోరీ హల్ చల్ చేయగా.. దీ గురించి మనోజ్ ఫ్యాన్ ఒకరు ట్విట్టర్లో ప్రస్తావించారు. మనోజ్ ను ట్యాగ్ చేస్తూ క్లారిటీ ఇవ్వమన్నాడు. అందుకు బదులుగా ’వాళ్ల బొంద’ అని బదులిచ్చాడు మనోజ్. దీనీపై వివరణ ఇస్తూ.. లైఫ్ లాంగ్ ప్రణతిని ప్రేమిస్తూంటానని.. ఆమె ఎప్పుడూ తన గుండెల్లో ఉంటుందని వివరించాడు.

ఆ విధంగా స్పందించిన మనోజ్ ఇప్పుడు విడాకులు తీసుకోవడంతో పాత ట్వీట్లను బయటకు తీస్తున్నారు జనాలు. ప్రధానంగా వాళ్ల బొంద అని మనోజ్ చేసిన ట్వీట్ ను చాలా మంది రీట్విట్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. ఇక మనోజ్ ఫ్యాన్స్ మాత్రం మనోజ్ కు సపోర్ట్ గా ఇతర నెటిజన్లకు కౌంటర్లు ఇస్తున్నారు.

Loading...