Friday, March 29, 2024
- Advertisement -

అనుష్క పెళ్లి క్రికెటర్ తో కాదు డైరెక్టర్ తో ?

- Advertisement -

అనుష్క శెట్టి పెళ్లిపై రోజుకు ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూనే ఉంటుంది. ఆమె పెళ్లి కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. గతంలో డార్లింగ్ ప్రభాస్ తో అనుష్క ప్రేమలో ఉందని.. వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని ఇలా రకరకల వార్తలు వీరిద్దరిపై వచ్చాయి. అయితే తర్వాత అందులో ఎలాంటి నిజం లేదని ప్రభాస్, అనుష్క ఖండించారు.

ఆ తర్వాత ఓ ప్రముఖ పారిశ్రామిక వేత్తతో స్వీటీ ఎఫైర్ కొనసాగిస్తోందన్న ప్రచారం అంతే జోరుగా సాగింది. అంతేకాకుండా ఇంట్లో చూసిన ఓ కుర్రాడిని అనుష్క పెళ్లి చేసుకోబోతుందని కూడా ప్రచారం సాగింది. ఆ తర్వాత సైజ్ జోరో కోసం బరువు పెరిగిన అనుష్క ఆ తర్వాత బరువు తగ్గేందుకు నానా తిప్పలు పడుతుందని కూడా అనుష్కపై మీడియాలో వార్తలు వచ్చాయి.

ఇక గత కొద్ది కాలంగా ఓ ప్రముఖ క్రికెటర్ ని అనుష్క పెళ్లి చేసుకోబోతుందని ప్రచారం సాగింది. అయితే ఇటీవలే తనపై వస్తున్న వార్తలపై స్పందించిన అనుష్క.. వాటిని ఖండించింది. ఇంత జరిగినా స్వీటీపై రూమర్స్ వస్తునే ఉన్నాయి. ప్రభాస్ కాదు.. పారిశ్రామిక వేత్త కాదు..క్రికెటర్ కాదు.. ఓ వెటరన్ డైరెక్టర్ కుమారుడు కం యంగ్ డైరెక్టర్ ని అనుష్క పెళ్లాడబోతోందని ప్రచారమవుతోంది.

అతను ఇప్పటికే తన భార్యకు విడాకులు ఇచ్చి అనుష్కతో ఎఫైర్ సాగిస్తున్నాడని వేడెక్కిపోయే మ్యాటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక అతడిని పెళ్లాడేందుకు అనుష్క రెడీ అవుతోందన్న వార్తా సంచలనమైంది. అనుష్క పెళ్లి ఈ ఏడాదే ఉంటుందని వార్త వైరల్ అయింది. మరి ఈ వార్తపై అనుష్క ఎలా స్పందిస్తుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -