Thursday, April 25, 2024
- Advertisement -

హీరోయిన్‌పై మెగాస్టార్ ఆగ్రహం….. బేన్ చేయాల్సిందేనంటున్న మెగా కాంపౌండ్

- Advertisement -

మెగా ఫ్యామిలీనా మజాకా…. మెగాస్టార్, పవర్ స్టార్‌లతో పాటు దాదాపు 11మంది హీరోలు ఉన్న ఫ్యామిలీ…….ఒకరకంగా టాలీవుడ్ రారాజుల్లాంటి ఫ్యామిలీ…….అలాంటి ఫ్యామిలీతో పెట్టుకున్న హీరోల కెరీర్‌లే నాశనం అయిపోయాయి…..ఇక ఒక హీరోయిన్ కెరీర్ ఒక లెక్కా. అయినప్పటికీ……ఎన్నో సంవత్సరాలుగా తెలుగు సినిమాల్లో యాక్ట్ చేస్తున్నప్పటికీ……మెగా కాంపౌండ్ గురించి అన్నీ తెలిసే ఉన్నప్పటికీ యంగ్ అండ్ హాట్ హీరోయిన్ అలాంటి మెగా హీరోతోనే పెట్టుకుని ఇప్పుడు తన కెరీర్ మీదకే తెచ్చుకుంది. టాలీవుడ్ ఈ హీరోయిన్‌పై బ్యాన్ విధించాలని మెగా ఫ్యామిలీ ఇప్పుడు తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకుని వస్తుండడం తెలుగు సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది.

తెలుగు సినిమా ఇండస్ట్రీపైన మెగా ఫ్యామిలీకి ఉన్న కమాండ్ గురించి కొత్తగా చెప్పేదేముంది. టాలీవుడ్‌కి వచ్చిన హీరోయిన్స్ అందరూ కూడా మెగా హీరోయిన్ అని ముద్ర వేయించుకోవడానికి తహతహలాడతారు. మెగా ఫ్యామిలీ హీరోలతో నటించడమే ధ్యేయం అన్న రేంజ్‌లో కలరింగ్ ఇస్తూ ఉంటారు. హీరోయిన్ తాప్సీలాంటి టాలెంటెడ్ అండ్ గ్లామరస్ యాక్ట్రెస్ కూడా మెగా హీరోల విషయంలో పట్టించుకోనట్టుగా వ్యవహరించిందన్న కారణంతోనే ఏ ఒక్క మెగా హీరో కూడా తాప్సీతో నటించడానికి ఇష్టపడలేదు.

ఇప్పుడు మెహ్రీన్ విషయంలో కూడా మెగా ఫ్యామిలీనే అలానే రియాక్ట్ అవుతోంది. మెగాస్టార్ చిరంజీవికి కొత్త అల్లుడైన కళ్యాణ్‌తో నటించడానికి మెహ్రీన్ ఇష్టపడలేదు. అసలే ఫ్లాప్స్‌లో ఉన్న తన కెరీర్ మరీ చిన్న హీరో అయిన కళ్యాణ్‌తో యాక్ట్ చేస్తే ఇంకా డౌన్ అవుతుందేమో…….పెద్ద హీరోలు ఆఫర్స్ ఇవ్వరేమో అని భయపడిన మెహ్రీన్ కళ్యాణ్‌తో నటించడానికి నో చెప్పింది. అయితే మెగా హీరోతో నటించడానికి, అది కూడా మెగాస్టార్ అల్లుడితో నటించడానికి మెహ్రీన్ నో చెప్పడంతో స్వయంగా మెగాస్టార్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశాడని తెలుస్తోంది. అందుకే అల్లు అరవింద్‌తో సహా మెగా కాంపౌండ్ మొత్తం ఇప్పుడు మెహ్రీన్‌ని బ్యాన్ చేయాలని మా అసోసియేషన్‌పై ఒత్తిడి తెస్తోందట. అసలే ఫ్లాప్స్‌లో ఉన్న మెహ్రీన్ ఇప్పుడు ఈ సంకట స్థితిని ఎలా ఫేస్ చూస్తుందో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -