Wednesday, April 24, 2024
- Advertisement -

మళ్లీ డ్యూయల్ రోల్ పోషించబోతున్న మెగా స్టార్

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మొట్ట మొదటి స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా తర్వాత చిరు తన 150వ సినిమాను ప్రముఖ దర్శకుడు కొరటాల శివతో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే భరత్ అనే నేను సినిమా తో బ్లాక్ బస్టర్ అందుకున్న కొరటాల శివ ఇప్పుడు చిరు కోసం అదిరిపోయే స్క్రిప్ట్ను సిద్ధం చేశాడని తెలుస్తోంది.

తాజాగా ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాలో చిరంజీవి డ్యూయల్ రోల్ పోషించబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే పలు సినిమాలలో డ్యూయల్ రోల్ చేసిన మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్యనే ‘ఖైదీ నంబర్ 150’ సినిమాలో కూడా డ్యూయల్ రోల్ పోషించారు. మరోవైపు ఈ సినిమా కోసం నయనతార ను హీరోయిన్ గా అనుకుంటున్నట్లు తెలుస్తోంది. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్ చరణ్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -