Friday, April 19, 2024
- Advertisement -

అనసూయ కు ఊహించని షాక్ ఇచ్చిన మెగాస్టార్..!

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి సైరా నర్సింహా రెడ్డి సినిమా సక్సెస్ కావడంతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఇదే జోష్ లో కొరటాల శివ డైరెక్షలో సినిమాకి కొబ్బరికాయ కొట్టాడు. పూజా కార్యక్రమాలు కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఓ మెసేజ్ ఇస్తూ.. కమర్షల్ గా ఈ సినిమాని కొరటాల తెరకెక్కుంచనున్నాడట.

ఈ చిత్రంలో చిరంజీవి ఉమెన్ హాకీ కోచ్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఇంకోవైపు నక్సలైట్ పాత్ర కూడా చేయబోతున్నట్లు చెబుతున్నారు. ఆ పాత్రలో మెగాస్టార్ నెరిసిన జుట్టుతో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో యాంకర్ అనసూయ ఓ పాత్ర చేయబోతుందని గత కొంత కాలం నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. కానీ తాజాగా ఆమె ఈ చిత్రంలో నటించడం కష్టమే అంటున్నారు.

మరి ఆమె పాత్రను తీసేశారో లేక ఆమె స్థానంలో మరో నటిని తీసుకున్నారో తెలియదు కానీ ప్రస్తుతానికైతే అనసూయ చిరు సినిమాలో నటించడం లేదని సోషల్ మీడియాలో పుకార్లు వినిపిస్తుండగా.. అనసూయ ఫ్యాన్స్ మాత్రం మెగాస్టార్ చిరు సినిమాలో అనసూయ నటించాల్సిందే అని కామెంట్స్ పెడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -