Friday, March 29, 2024
- Advertisement -

సినిమా చాన్సులు లేక మెహ్రీన్ ఏం చేస్తుందో తెలుసా ?

- Advertisement -

తెలుగులో ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ మూవీతో ఎంట్రీ ఇచ్చి చక్కని నటనతో కుర్రకారు తనవైపు తిప్పుకుంది మెహ్రీన్ పిర్జాదా. మొదటి సినిమానే మంచి హిట్ కావడం తో ఆమెకు వరస ఆఫర్లు క్యూ కట్టాయి. అయితే ఇప్పుడు ఆమె పేరు తెలుగే కాదు అసలు ఏ భాషలోనూ వినిపించడం లేదు. బోలెడంత అందం.. అభినయం ఉంది.

అందాలు ఆరబోసినప్పటికి ఈమెకు అవకాశాలు రావడం లేదు. రాజా ది గ్రేట్ – ఎఫ్2 లాంటి హిట్స్ ఉన్నా అమ్మడికి హిట్స్ వెనకే ఎక్కువ ప్లాప్స్ ఉన్నాయి. చివరిగా నాగశౌర్య అశ్వద్ధామలో కన్పించిన మెహ్రీన్ మళ్లీ తెరపై మెరవలేదు. ప్రస్తుతం అవకాశాల కోసం ఎదురుచూస్తుందట. బి టౌన్ లో ఇపుడు వెబ్ సిరీస్ లకు మంచి గిరాకీ ఉంది. బోల్డ్ సీన్స్ లో నటించేందుకు హీరోయిన్లు ఆసక్తి చూపించడంతో వెబ్ సిరీస్ లకు భలే ఆదరణ ఏర్పడింది.

మెహ్రీన్ తమ్ముడు గుర్ఫతే సింగ్ ఫిర్జాదా బాలీవుడ్ లో ‘గిల్టీ’ అనే వెబ్ సిరీస్ లో నటించాడు. దానికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఆ పాపులారిటీతోనే గుర్ఫతే – తన అక్క మెహ్రీన్ కి ఓ వెబ్ సిరీస్ లో అవకాశం ఇప్పించినట్టు టాక్ నడుస్తోంది. నెట్ ఫ్లిక్స్ లో ప్రసారమయ్యే ఈ వెబ్ సిరీస్ లో మెహ్రీన్ ఎలా కనిపిస్తుందో ఎంతలా బీటౌన్ జనాలను ఆకట్టుకుంటుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తోంది. మరి ఈ వెబ్ సిరీస్ తోనైనా మెహ్రీన్ మళ్లీ బిజీ హీరోయిన్ అయిపోతుందేమో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -