Thursday, April 25, 2024
- Advertisement -

జబర్దస్త్ ముందు వీళ్లు ఏం చేసేవారంటే ?

- Advertisement -

జబర్దస్త్ షోకి మంచి క్రేజ్ ఉంది. ఈ షో ద్వారా చాలా మంది కమెడియన్స్ గా పరిచయం అయ్యారు. బాగా డబ్బులు సంపాధించుకుని సినిమాల్లో కూడా నటిస్తున్నారు. ఈ ఒక్క షో వల్ల ఎంతో మంది జీవితాలు ఒక్కసారిగా తిరిగాయి. ఫ్యామిలీ స్కిట్స్ తో చమ్మక్ చంద్ర ప్రేక్షకులను బాగా నవ్విస్తాడు. ఇతడికి రెమ్యునరేషన్ కూడా బానే ఉందట. 3నుంచి 4లక్షలు సంపాదిస్తున్నాడట.

జబర్దస్త్ కు రాకముందు చంద్ర కూలీ పని చేసేవాడట. ఇక సుడిగాలి సుధీర్ కూడా ఒక ఎపిసోడ్ కి మూడున్నర లక్షలు అందుకుంటున్నాడని తెలుస్తోంది. అయితే ఇతను జబర్దస్త్ కు రాకముందు మెజీషియన్ గా చేస్తూ నెలకు పదివేలు కూడా సంపాదించలేని పరిస్థితి ఉండేదట. అదిరే అభి గతంలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా చేసేవాడు. ఇప్పుడు ఒక్కో ఎపిసోడ్ కి రెండున్నర నుంచి మూడు లక్షలు అందుకుంటున్నాడు.

రాకెట్ రాఘవ దూరదర్శన్ స్క్రిప్ట్ రైటర్ గా పనిచేసి, ఇప్పుడు జబర్దస్త్ లో ఒక్కో ఎపిసోడ్ కి రెండున్నర లక్షలు తీసుకుంటున్నాడట. ఎఫ్ ఎం రేడియోలో పని చేసే చలాకీ చంటి ఇప్పుడు జబర్దస్త్ ద్వారా ఒక్కో ఎపిసోడ్ కు రెండు లక్షలు సంపాదిస్తున్నాడు. హైపర్ ఆది బిటెక్ చేసి ఖాళీగా ఉండేవాడు. జబర్దస్త్ తో క్రేజ్ తెచ్చుకుని ఎపిసోడ్ కి మూడు లక్షలు తీసుకుంటున్నాడట.

టీ బాయ్ గా పని చేసే ముక్కు అవినాష్ ఇప్పుడు లక్ష రూపాయల పారితోషికం తీసుకుంటున్నాడు. ఇక రైటర్ గా పేరు తెచ్చుకున్న రాంప్రసాద్ గతంలో హోల్ సేల్ మెడికల్ రంగంలో పని చేశాడు. ఇప్పుడు జబర్దస్త్ ద్వారా మంచి రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు. ఇక కీరాక్ ఆర్పీ గతంలో ఓ హోటల్ లో పని చేసేవాడు. జబర్దస్త్ ద్వారా ఒక్కో ఎపిసోడ్ కి రెండు లక్షల వరకు అందుకుంటున్నాడట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -