జబర్దస్త్‌ను ఇలా కావడానికి కారణం వీళ్లే : నాగబాబు

2956
naga babu comments on mallemala production team
naga babu comments on mallemala production team

జబర్దస్త్ నుంచి నాగబాబు బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే బయటకు వచ్చిన తర్వాత కూడా జబర్దస్త్ గురించి షాకింగ్ విషయాలను నాగబాబు చెప్పుకొస్తున్నారు. ప్రధానంగా జబర్దస్త్ షోను మధ్యలో ఉన్న వాళ్లే నాశనం చేశారని నాగబాబు అన్నారు. నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డికి ఇది తెలుసో లేదో నాకు తెలియదు. ఒకవేల ఆయనకు తెలిసిన కామ్ గా ఉంటే నేను ఏం చేయాలేనంటూ క్లారిటీ ఇచ్చాడు నాగబాబు.

జబర్దస్త్ షో కోసం చాలా కష్టపడ్డానని.. మీరు లేకుంటే షో చూడాలకేపోతున్నాం అని ఇప్పటికి చాలా మంది చెబుతున్నారని.. అలాంటి వాళ్లకు ఎలాంటి జవాబు ఇవ్వాలో అర్దం కావడం లేదని అన్నారు. తనను బాగా చూసుకున్నప్పటికి తన చుట్టు ఉన్న వాళ్లను మాత్రం ట్రీట్మెంట్ దారుణంగా ఉండేదని గుర్తు చేసుకున్నారు నాగబాబు. అందులో ఉన్న వాళ్లందరి గురించి ఒక్కొక్కరిగా చెప్పుకుంటూ వచ్చాడు నాగబాబు.

మొదట్లో వేణు వండర్స్ పై ఓ దాడి జరిగితే కనీసం మల్లెమాల కానీ.. ఛానెల్ వాళ్లు కానీ ఒక్క మాట మాట్లాడలేదని.. అప్పుడు తానే ముందుకెళ్లి అన్ని చూసుకున్నట్లు నాగబాబు అన్నారు. కార్పోరేట్ కంపెనీలాగే ఆలోచించి.. తమ షో ఒక్కటి బాగా వస్తే చాలు ఎవరు ఎటుపోతే తమకెందుకు అన్నట్లే ప్రవర్తించారని సంచలన వ్యాఖ్యలు చేసాడు మెగా బ్రదర్. వేణు, ధనరాజ్ లాంటి వాళ్లు అందుకే షో నుంచి వెళ్లిపోయేరామో అని నాగబాబు అన్నారు.

తర్వాత ఎవరికి కష్టం వచ్చిన కూడా అంతా కలిసి పంచుకున్నామని.. పంచ్ ప్రసాద్ కు అనారోగ్యం వచ్చినప్పుడు కూడా అంతా కలిసే ఉన్నామని.. అప్పుడు కూడా ఛానెల్, మల్లెమాల సాయం చేయలేదని చెప్పుకొచ్చాడు. ఇలా చాలా విషయాల్లో మలెమాల నుంచి ఎలాంటి స్పందన లేదని నాగబాబు చెప్పుకొచ్చారు.

Loading...