నాగబాబు పై ఫైర్ అయిన ఎన్టీఆర్.. ఎందుకు ?

3035
Naga Babu Fires on Balakrishna
Naga Babu Fires on Balakrishna

గత రెండు నెలల నుంచి లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సినీ ఇండస్ట్రి బాగా దెబ్బతింది. థియేటర్లు, షూటింగ్ లు ఆగిపోవాడంతో ఎన్నో సినిమాలు ఆగిపోయాయి. ఇక షూటింగ్ ఫైనల్ స్టేజిలో ఉన్న సినిమాలు ఎప్పుడు ఎప్పుడు షూట్ చేయాలని అని ఆయా సినిమా యూనిట్ లు ఎదురు చూస్తున్నాయి. దీంతో కొన్ని నిబంధనలతో తిరిగి షూటింగ్ లు ప్రారంబించడానికి ప్రభుత్వం నుండి పర్మిషన్లు తెచ్చుకోవడానికి ఎన్నో మీటింగ్ లు నిర్వహించారు.

చిరంజీవి, నాగార్జున లతో పాటు ఎంతో మంది నిర్మాతలు కూడా ఈ మీటింగ్స్ లో పాల్గొన్నారు. అయితే టాలీవుడ్ లో బడా హీరో బాలయ్యను ఈ మీటింగ్ లకు ఆహ్వానించలేదని.. ఆయన ఫైర్ అయ్యారు. “అన్ని మీటింగ్లలో ఒక్క మీటింగ్ కు కూడా తనని ఆహ్వానించలేదని.. తలసానితో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారా?’ అంటూ కామెంట్స్ చేసాడు బాలయ్య. దానికి నాగబాబు.. బాలయ్య పై సెటైర్లు వేస్తూ యూట్యూబ్ లో ఓ వీడియోని పోస్ట్ చేసాడు. ఆ వీడియోలో ‘బాలయ్య నోరు అదుపులో పెట్టుకో’ అంటూ ఓ వీడియోని విడుదల చేసాడు.

ఈ వీడియో చూసిన నందమూరి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వీడియో ఎన్టీఆర్ వరకు వెళ్లిందట. ఆ వీడియో చూసిన ఎన్టీఆర్.. నాగబాబు పై ఫైర్ అయ్యాడట. గత కొంతకాలం నుంచి మెగా ఫ్యామిలీకి ఎన్టీఆర్ అత్యంత సన్నిహితుడుగా ఉంటున్నారు. చరణ్ తో “ఆర్ ఆర్ ఆర్” సినిమాలో కూడా నటిస్తున్నాడు. దాంతో చరణ్ ను కలిసి ఏమన్నా ఉంటే “మనం మనం కూర్చుని మాట్లాడుకుందాం. ఇలా బయట రచ్చ చేయడం సరైనది కాదు” అంటూ చరణ్ తో ఎన్టీఆర్ చెప్పాడట.

Loading...