Tuesday, April 23, 2024
- Advertisement -

ఇగో కి పోయి చైతన్య ఆ పని చేశాడా?

- Advertisement -

మీడియా లో ఎప్పటికి అప్పుడు అనేక రూమర్లు వస్తుంటాయి పోతుంటాయి కానీ స్టార్ హీరోలు, స్టార్ హీరోయిన్లు తమ పై వచ్చిన రుమర్లని చాలా లైట్ గా తీసుకుంటారు. చాలా సమయాలలో వారు వాటి గురించి పట్టించుకోరు కూడా. అయితే తాజా గా నాగ చైతన్య సమంత గురించి మీడియా లో ఒక ప్రత్యేక కథనం తిరుగుతుంది. వివరాల లోకి వెళితే ఇటీవలే సమంత స్టాఫ్ మీద నాగ చైతన్య తన కోపాన్ని ప్రదర్శించాడు అని మీడియా లో రూమర్లు తిరుగుతున్నాయి.

సమంత అంటే సమంత స్టాఫ్ కి ఎంతో గౌరవం. సమంత తన స్టాఫ్ ని తన కుటుంబ సభ్యులు లాగా చాలా బాగా చూసుకుంటుంది. తన కెరీర్ మొదటి లో ఎవరైతే స్టాఫ్ గా ఉన్నారో ఇప్పటి వరకు వారే కంటిన్యూ అవుతూ వచ్చారు. వారికి సంబంచిన కుటుంబ వ్యహారాలు, చదువు విషయాలు, ఆర్థిక లావాదేవీలను సమంత దగ్గర ఉండి చూసుకోవడం వల్ల వాళ్ళందరికీ సమంత అంటే ఎనలేని అభిమానం ఏర్పడింది.

తాజా సమాచారం మేరకు ఇటీవల మజిలీ సినిమా విడుదల అయిన తరువాత సమంత స్టాఫ్ నాగ చైతన్య స్టాఫ్ మధ్య ఇద్దరిలో ఎవరు బాగా చేశారు అనే డిస్కషన్ వచ్చింది అట. ఈ డిస్కషన్ లో నాగ చైతన్య కూడా పాలుగొన్నడు అని తెలుస్తుంది. ఆ సందర్భం లో సమంత స్టాఫ్ అందరూ సమంత నే బాగా చేసింది అని చెప్పడం తో నాగ చైతన్య హర్ట్ అయ్యాడు అని మీడియా లో కథనాలు వస్తున్నాయి.

అయితే సాధారణం గా ఈగో కి చాలా దూరం గా ఉండే నాగ చైతన్య ఇంతటి విషయానికే హర్ట్ అవుతాడు అనేది అవాస్తవం అనే అనిపిస్తుంది. ఏది ఏమైనా ఇద్దరిలో ఎవరో ఒకరు క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -