Friday, March 29, 2024
- Advertisement -

మ‌రో రెండు సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్‌?

- Advertisement -

హీరోయిన్ సమంత అక్కినేని నాగ‌చైత‌న్య‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. పెళ్లి త‌రువాత వ‌రస హిట్ల‌తో దూసుకుపోతుంది.పెళ్లి త‌రువాత స‌మంత సినిమాలు మానేస్తుంద‌నే వార్త‌ల‌కు చెక్ చెబుతు వ‌ర‌స సినిమాల‌ను ఒప్పుకుంటోంది.స‌మంత ఇప్పటికే యు టర్న్‌ సినిమా షూటింగ్‌ పూర్తి చేసింది.మరో రెండు తమిళ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. త్వరలో నాగచైతన్యతో కలిసి ఓ సినిమాలో నటించేందుకు రెడీ అవుతున్నారు.

నిన్నుకోరి ఫేం శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాతో నాగచైతన్య, సమంత జంటగా నటించనున్నారు.ఈ సినిమాతో పాటు మరో సినిమాలోనూ ఈ జంట కనువిందు చేయనుందట. రిలీజ్‌కు రెడీ అవుతున్న ‘చి ల సౌ’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్న రాహుల్ రవీంద్రన్‌ తన తదుపరి చిత్రాన్ని కూడా ప్రకటించాడు. తన నెక్ట్స్ ప్రాజెక్ట్ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌లో ఉంటుందని ప్రకటించిన రాహుల్,నాగచైతన్య, సమంత కాంబినేషన్‌లో సినిమా చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నాడట. దీనిపై పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -