Thursday, April 25, 2024
- Advertisement -

‘ఎన్టీఆర్’ బ‌యోపిక్‌లో మెగా హీరో

- Advertisement -

ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి న‌టుడు స్వ‌ర్గీయ నంద‌మూరి తార‌క రామ‌రావు జీవిత క‌థ‌ను ఎన్టీఆర్ పేరుతో సినిమాగా తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈసినిమాను ఆయ‌న త‌న‌యుడు బాల‌కృష్ట న‌టీస్తు,నిర్మిస్తున్నారు.ద‌ర్శ‌కుడు క్రిష్ ఈ సినిమా బాధ్య‌త‌లు చెపట్టిన ద‌గ్గ‌ర నుంచి ఈ బ‌యోపిక్‌పై అంచ‌నాలు విపరీతంగా పెరిగాయి. ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటుంది.కొన్ని రోజులపాటు ఈ సినిమాకి సంబంధించిన ముఖ్యమైన సన్నివేశాలను, హైదరాబాద్ – అబిడ్స్ లోని ఎన్టీఆర్ పాత ఇంట్లో చిత్రీకరించారు.

తదుపరి షెడ్యూల్లో అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.ఇక ఈ సినిమాలో ఎస్వీ రంగారావు పాత్రలో ‘నాగబాబు’ను తీసుకోనున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఈ పాత్రకి నాగబాబు సరిగ్గా సరిపోతారనీ క్రిష్ భావిస్తున్నాడ‌ట‌.మ‌రి దీనిపై నాగ‌బాబు ఎలా స్పందిస్తారో చూడాలి. శ్రీదేవి పాత్రలో రకుల్ కనిపించనుండగా, జయప్రద పాత్రలో రాశిఖన్నా వార్త‌లు విన‌బ‌డుతున్నాయి.మ‌రి దీనిపై పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -