Friday, April 26, 2024
- Advertisement -

చిరు సినిమా అనసూయ దూరం.. నాగబాబు కారణమా ?

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా తెర్కక్కుతుంది. ఈ సినిమా మొదలు కాకముందే ఇందులో అనసూయ కీలక పాత్ర పోషిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రకు ఫిదా అయిన చిరంజీవి తన మూవీలో ఆమెను నటింపజేయాలని అనుకున్నాడట.

సో అలా కొరటాల చెప్పిన కథలో ఒక పాత్రకు ఆమె అయితే బాగుంటుందని చిరంజీవి భావించి కొరటాలకు ఆమెను సిఫార్సు చేయడం జరిగింది అంటూ ప్రచారం జరిగింది. తీరా మూవీ షూటింగ్ మొదలు అయిన తర్వాత మెగా 152లో అనసూయ లేదు అంటూ వార్తలు వస్తున్నాయి. ఆ పాత్ర కోసం నిన్నటి తరం హీరోయిన్ తీసుకున్నారని.. ఇప్పటికే ఆమెతో చర్చలు కూడా పూర్తి అయ్యాయి అంటున్నారు. అలానే ఆ పాత్ర నిడివి కూడా పెంచి ఆ సినీయర్ హీరోయిన్ తో చేయించబోతున్నట్లుగా చెబుతున్నారు.

ఉన్నట్లుండి మెగా సినిమా నుంచి అనసూయను ఎందుకు తప్పించినట్లుగా అంటూ చర్చ నడుస్తోంది. అయితే ఈ విషయంపై సోషల్ మీడియాలో ఎవరికి నచ్చినట్లు వాళ్లు మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా జబర్దస్త్ నుండి బయటకు వెళ్లి పోయిన నాగబాబు అదిరింది షోని షురూ చేశాడు.

అదిరిందికి అనసూయను యాంకర్ గా చేయమంటూ నాగబాబు కోరాడట. అందుకు అనసూయ నో చెప్పిందని అందుకే హర్ట్ అయిన నాగబాబు చిరంజీవి సినిమా నుండి తప్పించేలా చేశాడని కొందరు నెటిజన్లు అంటున్నారు. అసలు విషయం తెలియదు కానీ ఈ పుకార్లు మాత్రం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -