పటాస్ నుంచి రవి.. జబర్దస్త్ నుంచి నాగబాబు ఔట్..?

4287
Nagababu Out Of Jabardasth and Ravi Out OF Patas
Nagababu Out Of Jabardasth and Ravi Out OF Patas

ప్రస్తుతం జబర్దస్త్, పటాస్ టాప్ రేటింగ్ లో దూసుకెళ్తున్నాయి. ఈ రెండు షోలు వచ్చి సంవత్సరాలు దాటుతున్నప్పటికి వీటి క్రేజ్ మాత్రం అసలు తగ్గట్లేదు. అయితే పటాస్ షో పెద్ద హిట్ కావడానికి ముఖ్య కారణం యాంకర్ రవి. తన పంచులతో.. డైన్స్ లతో షోని బాగా హైలైట్ చేసి నడిపిస్తున్నాడు. ఇక జబర్దస్త్ షో హిట్ అవ్వడానికి ముఖ్య కారణం నాగబాబు, రోజా. వారి నవ్వుల వల్లే షోకి మంచి పేరు వచ్చింది.

అయితే పటాస్ నుంచి రవి, జబర్దస్త్ నుంచి నాగబాబు తప్పుకోబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. యాంకర్ రవి స్థానంలో నోయల్ లేదా చలాకీ చంటీ వచ్చే ఛాన్స్ ఉందని.. రవి వెళ్లిపోవడానికి ప్రధాన కారణం ఛానెల్ తో అగ్రిమెంట్ చేసుకోవడమే అని తెలుస్తోంది. మల్లెమాల సంస్థ షరతులు పెట్టడంతో రవి పటాస్ నుంచి బయటకు వెళ్లిపోయాడని వార్తలు వస్తున్నాయి. జబర్దస్త్ షో ప్రారంభం నుంచి నాగబాబు జడ్జిగా ఉన్నారు. ఈ షో నుంచి ఇప్పటికే డైరెక్టర్లు నితిన్ మరియు భరత్ వెళ్లిపోయారు.

సంస్థతో విబేధాలు రావటం వలన వీరిద్దరూ తప్పుకున్నారని వార్తలు వినిపించాయి. ఈ ఇద్దరు డైరెక్టరు జబర్దస్త్ నుంచి వెళ్లిపోవడంతో నాగబాబు కూడా సదరు డైరెక్టర్లతో ఉండే సాన్నిహిత్యం వలన తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. యాంకర్ రవి, నాగబాబు ఇద్దరూ పటాస్, జబర్దస్త్ షోల నుంచి తప్పుకుంటే ఆ ప్రభావం షోలపై పడే ఛాన్స్ ఉంది. మరి నాగబాబు స్థానాన్ని జబర్దస్త్ షోలో ఎవరు భర్తీ చేస్తారో చూడాలి.

Loading...