Friday, March 29, 2024
- Advertisement -

బిగ్ బాస్ 4లో వర్మ ’నగ్నం బ్యూటీ’.. ?

- Advertisement -

బిగ్ బాస్ సీజన్ 4 కోసం కంటిస్టెంట్ల కోసం వేట మొదలైంది. ఈ నేపథ్యంలో పలువురి సెలబ్రిటీల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ రేసులో ‘నగ్నం’ హీరోయిన్ శ్రీ రాపాక కూడా ఉందనే ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. రామ్ గోపాల్ వర్మ రూపొందించిన ‘నగ్నం’ సినిమాతో బాగా పాపులర్ అయింది శ్రీరాపాక.

అయితే ఆమెకు హీరోయిన్ గా ఇదే మొదటి సినిమా అయినప్పటికి.. ఈమెకు పదేళ్లుగా ఇండస్ట్రీతో పరిచయాలు ఉన్నాయి. వర్మ టేకింగ్, శ్రీ రాపాక అందంతో నగ్నం మూవీ బోల్డ్ కిక్ ఇచ్చింది శ్రీపాక. దీంతో శ్రీ రాపాకను వరుసపెట్టి ఇంటర్వూస్ చేస్తున్నాయి పలు యూట్యూబ్ ఛానెల్స్. ఈ నేపథ్యంలో ఆమె ఇంటర్వ్యులో చేస్తున్న బోల్డ్ కామెంట్స్ వల్ల ఆమె నిత్యం వార్తల్లో నిలుస్తోంది. అయితే బాగా క్రేజ్ తెచ్చుకున్న వారికి బిగ్ బాస్ లో తప్పక చోటు లభిస్తోంది. గతంలో ఇలానే జరిగింది.

కాంట్రవరీ కింగ్ అయినా, ఫేమస్ పర్సన్ అయినా, బోల్డ్ బ్యూటీ అయినా.. ఇలా ఏదో ఒక పాయింట్‌లో జనాలను అట్రాక్ట్ చేసిన వ్యక్తులే బిగ్ బాస్‌లో కనిపిస్తుంటారు. సో.. ఇది గమనించే బిగ్ బాస్ మేనేజ్‌మెంట్ దృష్టి తనపై పడేలా శ్రీ రాపాక ఇలాంటి బోల్డ్ కామెంట్స్ చేస్తోందనే టాక్ బలంగా వినిపిస్తోంది. మరి బిగ్ హౌస్ లో ఈ భామ మెరుస్తుందో లేదో చూడాలి.

నాకు కరోనా వస్తే పవన్ కనీసం ఫోన్ చేయలేదు : బండ్ల గణేష్

బిగ్‌బాస్‌ 4కి హోస్ట్ గా విజయ్ దేవరకొండ..?

సీక్రెట్ గా హీరోయిన్ తేజస్వికి పెళ్లి అయిందా ?

అషూరెడ్డితో రిలేషన్ షిప్ లో ఉన్నాను : రాహుల్ సిప్లీగంజ్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -