Saturday, April 20, 2024
- Advertisement -

మహేష్ కంటే ముందు నమ్రత వేరే వ్యక్తిని ప్రేమించిందట..!

- Advertisement -

మహేష్, నమ్రత శిరోద్కర్ లది అనోన్య దాంపత్యం. వీరు ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించుకుటూ హ్యాపీ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. మహేష్ బాబు ని ప్రేమించి పెళ్లి చేసుకుంది నమ్రత. అప్పటికే సినిమాల్లో మంచి హీరోయిన్ గా కొనసాగుతోంది నమ్రత. అయితే భర్త, పిల్లల కోసం సినిమాలను మానేసింది.

గౌతమ్, సితారల సంరక్షణ చూసుకోవడంతో పాటు మహేష్ కి సలహాదారు పాత్ర కూడా పోషిస్తున్నారు. 2000లో వచ్చిన వంశీ చిత్రంలో వీరిద్దరూ కలిసి నటించగా అప్పటి నుండి ఐదేళ్లు రిలేషన్ లోనే ఉన్నారు. 2005లో మహేష్, నమత్ర ఎవరికీ తెలియకుండా రహస్య వివాహం చేసుకున్నారు. 2004లో చిరంజీవి హీరోగా వచ్చిన అంజి నమత్ర చివరి చిత్రం. ఐతే ఓ ఇంటర్వ్యూలో నమత్ర తన ఫస్ట్ లవ్ గురించి చెప్పింది. అందరూ అనుకున్నట్టు మహేష్ నమ్రత ఫస్ట్ లవ్ కాదట. కెరీర్ బిగినింగ్ లో నమత్ర దీపక్ శెట్టి అనే ఓ వ్యక్తిని ప్రేమించారట.

కొన్నాళ్ళు వీళ్ళిద్దరూ డేటింగ్ కూడా చేశారట. కొద్దిరోజులలో పెళ్లి అనుకుంటున్న తరుణంలో కొన్ని కారణాల వలన విడిపోయారట. ఆ టైంలో నమ్రత డిప్రెషన్ కి వెళ్లిందట. ఆ బాధ నుంచి బయటకు వచ్చేందుకు చాలా టైం పట్టిందట. తర్వాత కెరీర్ పై ఫోకస్ పెట్టి అతన్ని మర్చిపోయిందట. మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసి 1993లో ఫెమీనా మిస్ ఇండియా యూనివర్స్ మరియు ఫెమీనా మిస్ ఇండియా ఆసియా పసిఫిక్ టైటిల్స్ గెలుచుకున్నారు. ఇక మహేశ్ కంటే నమ్రత 4ఏళ్ళు పెద్దది. ఆమె వయసు ఇప్పుడు 48ఏళ్ల, మహేశ్ వయసు 44ఏళ్ళు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -