అమ్మాయికి ఇష్టం ఉంటనే వెళ్తోంది : నందినీ రాయ్

658
nandini rai about casting couch and her offers in tollywood
nandini rai about casting couch and her offers in tollywood

అదృష్టం ఉంటేనే కొన్ని జరుగుతాయి అని.. అదృష్టం లేకుంటే ఎంత అందంగా ఉన్న లాభం లేదు. నందినీ రాయ్ విషయంలో ఇది నిజమే అనిపిస్తోంది. కావాల్సినంత అందం ఉండి కూడా సరైన అవకాశాలు రావడం లేదు ఆమెకి. వెండితెరపై క్రేజ్ తెచ్చుకోలేకపోయింది కానీ బిగ్ బాస్ ద్వారా బాగా ఫేమస్ అయింది. రెండో సీజన్‌లో తనీష్‌తో నడిపిన రహస్య బంధం అప్పట్లో ఎంతో వైరల్ అయింది.

తాజాగా ఈమె ‘హలో యాప్’ నిర్వహించిన లైవ్ కార్యక్రమంలో పాల్గొని కొన్ని విషయాలు చెప్పింది. 2015లో మోసగాళ్లకు మోసగాడు సినిమాతో ఎంట్రీ ఇచ్చింది నందినీ. ఈ సినిమా ప్లాప్ అయింది. తర్వార నందినీ కనిపించలేదు. తర్వాత బిగ్ బాస్ లో మెరిసింది. అయితే ఈ గ్యాప్ లో చాలా ఆఫర్స్ వదిలేసినట్లు చెప్పింది. అడవి శేష్‘క్షణం’ సినిమాకు నందినీ రాయ్‌ను అడిగారట. అయితే అప్పటికే తాను హయ్యర్ స్టడీస్ కోసం లండన్ వెళ్లిందంటా. అదా శర్మ క్యారెక్టర్ తనకు ఆఫర్ చేశారని, అయితే తానెంతో పిచ్చిదాన్ని కాకపోయి ఉంటే.. క్షణం లాంటి సినిమాను వదులుకొన్నానని చెప్పుకొచ్చింది.‘మోసగాళ్లకు మోసగాడు’ పరాజయం తరువాత తాను డిప్రెషన్‌లోకి వెళ్లిపోయానని చెప్పుకొచ్చింది.

ఆ తరవాత తమిళ్ ‘గగనం’, కన్నడ ‘గుండెజారి గల్లంతయ్యిందే’లో చేసిన తరవాత బిగ్ బాస్ షోలో అవకాశం వచ్చిందని పేర్కొంది. ఇక సినీ పరిశ్రమలో తనకు క్యాస్టింగ్ కౌచ్ ఎదురవ్వలేదని.. వాళ్లను అడిగారు.. వీళ్లను అడిగారు అని ఇండస్ట్రీ గురించి చాలా మంది అంటారని. నిజానికి అలా ఏం ఉండదని తెలిపింది. అడిగేవాళ్లు అడుగుతారు. అంతా అమ్మాయి ఇష్టమేనని చెప్పుకొచ్చింది. ఒక అమ్మాయి వెళ్లాలి అనుకుంటే వెళ్తుంది.. ఒకవేళ ఆ అమ్మాయి ఇష్టం లేకపోతే నో చెప్తుందని తెలిపింది. ఎప్పుడూ ఎవరు ఎవరినీ ఫోర్స్ చేయరనీ, తాను కళ్లతో చూశాను కాబట్టి చెబుతున్నానని నందినీ చెప్పుకొచ్చింది.

Loading...