Thursday, March 28, 2024
- Advertisement -

నయనతార ప్రమోషన్స్ కి దూరంగా ఉండటానికి కారణం ఇదే..!

- Advertisement -

స్టార్ హీరోలకు ఎంత క్రేజ్ ఉందో నయనతారకు అంతే క్రేజ్ ఉంది. ఈమెకు తెలుగు, తమిళంలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కెరీర్ మొదట్లో గ్లామర్ పాత్రలు చేసి అదరగొట్టిన ఈ భామ.. కొత్త భామలు రావడంతో పోటీ ఎక్కువ అయిందని గ్రహించి.. అందుకే ‘రాజా రాణి’ నుండి కథా ప్రాధాన్యత ఉండే చిత్రాల్లోనే నటిస్తూ.. తన క్రేజ్ ను మరింత డబులు చేసుకుంది. ఈమె ఇప్పుడు ఒక్కో సినిమాకు 6 నుండీ 8 కోట్ల వరకూ పారితోషికం అందుకుంటుంది.

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా చేసినా స్టార్ హీరోల సినిమాల్లో నటించినా.. నయన్ కు తిరుగులేదు.. అనే నమ్మకం ప్రేక్షకుల్లో ఏర్పడింది. అయితే నయన్ సినిమా ప్రమోషన్లకు, మీడియా ఇంటర్వ్యూలకు దూరంగా ఉంటూ వస్తుంది అన్న విషయం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఒక్క ‘కర్తవ్యం’ సినిమా ప్రమోషన్లకు మాత్రమే నయన్ హాజరయ్యింది. ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం పై స్పందించి తన మనసులో మాటని బయట పెట్టింది నయన్.

ఆంఎ మాట్లాడుతూ..”నేను ఏం అనుకుంటున్నానో.. ఏం చేయాలనుకుంటున్నానో వంటి విషయాలు ప్రపంచానికి చెప్పాలని అనుకోను. ప్రధానంగా నా పర్సనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలు డిస్కస్ చేయడం నాకు ఇష్టం ఉండదు. నేను ప్రైవసి కోరుకుంటాను. సినిమాల గురించి మాత్రమే నేను మాట్లాడతాను. నా పర్సనల్ లైఫ్ గురించి మాత్రం స్పందించడం నాకు నచ్చదు” అని నయన్ చెప్పుకొచ్చింది.

పవన్ బర్త్ డే ‘వకీల్ సాబ్’ సర్ ఫ్రైజ్ గిఫ్ట్ ఇదే..!

షూటింగ్‌లు చేయం అంటున్న సుమ, అనసూయ.. ఎందుకు ?

వర్మ ’పవర్ స్టార్’మూవీపై పవన్ కళ్యాణ్ రియాక్షన్..!

పెళ్లి తర్వాత నటిస్తే తప్పేంటి ? : శ్రద్ధా శ్రీనాథ్‌

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -