Thursday, March 28, 2024
- Advertisement -

సినిమాల్లోకి రాకముందు నయనతార ఏం చేసేదంటే ?

- Advertisement -

నయనతార.. ఈమెకు ఉన్న క్రేజ్ సౌత్ లో మరో హీరోయిన్ కు లేదని చెప్పొచ్చు. హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి నయనతార ఎదిగింది. నయనతార సినిమా చేస్తుందంటే ఖచ్చితంగా ఆ సినిమా హిట్ అనే సెంటిమెంట్ ను సంపాధించుకుంది. వరుస పెట్టి స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తోంది.

అలానే లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా నటిస్తూ వరుస హిట్లు అందుకుంటుంది. ప్రస్తుతం నయనతారా ఒక్కో సినిమాకు 6 కోట్ల నుండీ 8 కోట్ల వరకూ రెమ్యునరేషన్ తీసుకుంటుందట. ఇది ఇలా ఉంటే.. ఒకానొక దశలో ఈమె పని అయిపొయింది అనుకున్న టైం లో… కథ మరియు పాత్రకి ప్రధాన్యత ఉండే స్క్రిప్ట్ లనే ఎంచుకుంటూ బౌన్స్ బ్యాక్ అయ్యి.. అప్పటికి ఉన్న ఇమేజ్ కు పదింతలు సంపాదించుకుంది నయన్. అయితే సినిమాల్లో రాకముందే ప్రతి హీరోయిన్ ఏదో ఒక పని చేసి ఉంటుంది.

నయనతార కూడా సినిమాల్లోకి రాకముందు.. పలు టీవి ఛానెల్స్ లో యాంకరింగ్ చేసిందనే వార్తలు వస్తున్నాయి. అందుకు సంబంధించిన వీడియోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అప్పట్లో నయనతార కాస్త లావుగానే ఉండేది. అయితే అసలు ఈ వీడియోలో ఉన్నది నయన తారేనా అనే అనుమానం కూడా కలుగుతోంది. అందుకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. అయితే మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్కేయండి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -