సుధీర్‌పై తన ఇష్టంను చెప్పిన రష్మీ.. ఏమనంటే ?

889
netizen questions rashmi gautam about sudigali sudheer
netizen questions rashmi gautam about sudigali sudheer

బుల్లితెరపై అతి తక్కువ కాలంలో మంచి పేరు తెచ్చుకున్నారు సుడిగాలి సుధీర్, రష్మీ గౌతమ్. బుల్లితెర ప్రేక్షకులకు రష్మీ, సుధీర్ స్క్రీన్ పై కనిపిస్తే చాలు పండగే పండగ. అందుకే వీరిద్దరికి విపరితమైన క్రేజ్ ఉంది. దాదాపు ఏడేళ్లుగా వీరిద్దరు తమ మధ్య ఎలాంటి రిలేషన్ లేదంటూనే.. ఏదో అనుబంధం ఉన్నట్లు జనాలకు బిల్డప్ ఇస్తూ వస్తున్నారు. నిత్యం వీరిద్దరి గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది.

తాజాగా లాక్ డౌన్‌తో జబర్దస్త్ షో ఆగిపోయిన విషయం తెలిసిందే. అన్ని రకాల షోల షూటింగ్స్‌ నిలిచిపోయాయి. దీంతో ఆర్టిస్టులంతా ఇంట్లోనే ఉంటున్నారు. ఇక రష్మీ గౌతమ్ షూట్స్ ఉన్నా లేకపోయినా… సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. అన్ని విషయాలపై స్పందిస్తూ ఉంటుంది ఈ జబర్దస్త్ బ్యూటీ. ఇక రష్మీకి ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువే. తాజాగా ఈ అమ్మడు ఆస్క్ రష్మీని ట్విట్టర్‌లో ప్రారంభించింది. ఈ సందర్భంగా నెటిజన్స్ రష్మీని పలు ప్రశ్నలు అడిగారు. ఇష్టమైన సినిమాలు, వ్యక్తులు, ఫుడ్ వంటి అడుగుతూ.. ఓ నెటిజన్ సుడిగాలి సుధీర్ గురించి ప్రశ్నించాడు.

సుడిగాలి సుధీర్ గురించి ఒక్క మాటలో చెప్పు అంటూ నెటిజన్ అడగగా.. రష్మీ బదిలిస్తూ.. అతనితో కలిసి పనిచేయడం ఓ అద్భుతం అంటూ జవాబు ఇచ్చింది. ఇక వీరిద్దరు ప్రేమించుకుంటున్నట్లు.. పెళ్లి చేసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అవేం నిజం కాదని వీరిద్దరు ఎప్పటికప్పుడు కొట్టిపరేస్తున్నారు. అయినప్పటికి ఈ వార్తలు ఆగడం లేదు.

Loading...