సుడిగాలి సుధీర్‌ చేసిన పనికి వార్నింగ్ ఇస్తున్న నెటిజన్లు..!

2477
netizens fire on sudigali sudheer
netizens fire on sudigali sudheer

కరోనా కారణంగా ప్రజలు బయటకు రావొద్దని.. అందరు ఇంట్లోనే ఉండాలని.. సోషల్ డిస్టెన్సింగ్ పై పెద్ద ఎత్తున అవగాహన పెంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఇలాంటి ప్రయత్నాలను అందరితో పాటు సినీ పెద్దలు కూడా తమ భుజాన వేసుకున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ మొదలు అందరు హీరోలు సోషల్ డిస్టెన్స్ పై అవగాహన పెంచేలా అన్ని రకల ప్రయత్నాలు చేస్తున్నారు.

దీనిపై ఇప్పటికే ప్రజల్లో అవగాహన పెంచేలా పాటలు, వీడియోలను సిద్దం చేశారు. అయితే ఇలాంటి ప్రయత్నాల్లో జబర్దస్త్ నటులు చేతులు కలపకపోవడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సుడిగాలి సుధీర్, యాంకర్ విష్ణుప్రియ ఇద్దరు హోస్ట్ చేస్తున్న పోవే పోరా ప్రోగ్రాం ప్రోమో ఒకటి రిలీజ్ అయింది. ఈ ప్రోమోలో ఎప్పటి లాగే ఇద్దరూ కలిసి నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా పాటకు ఇద్దరూ ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చారు. అంతే కాదు ఒకరిలో ఒకరు ఒదిగిపోయారు. అయితే మామూలు పరిస్థితులు ఉన్నప్పుడు ఇలా చేసి ఉంటే ఫ్యాన్స్ ఎంజాయ్ చేసి ఉండేవారు.

కానీ కరోనా నేపథ్యంలో ఇలా చేయడం ఎంత వరకూ కరెక్ట్ అని నెటిజన్లు మండిపడుతున్నారు. ఓ వైపు ప్రపంచ అంతా కరోనాకు భయపడి సోషల్ డిస్టన్స్ మెన్‍టైన్ చేస్తుంటే.. సుడిగాలి సుధీర్ మాత్రం బాధ్యత మరిచి ఇలా చేయడం ఏంటని అంటున్నారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్న సుడిగాలి సుధీర్ లాంటి వారు ముందుకు వచ్చి సోషల్ డిస్టన్స్ గురించి ఏదైనా చెబితే బాగుంటుందని నెటిజన్లు అంటున్నారు.

Loading...