Friday, April 26, 2024
- Advertisement -

ఎంతసేపు ఉన్న తొడలేనా.. ఇవేం సీన్లు.. త్రివిక్రమ్ పై ఫైర్..!

- Advertisement -

టాలీవుడ్ లో రచయిత నుంచి దర్శకులుగా మారిన వారికి మంచి ఫాలోయింగ్ ఉంది. పోసాని, త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ మొదలైన వారు ఈ కోవాలో ఉన్నావారే. వీరిలో త్రివిక్రమ్ కు స్పెషల్ క్రేజ్ ఉంది. తన మాటలతో మాయ చేస్తాడన్న పేరు ఉంది. రచయితగా సక్సెస్ అయిన త్రివిక్రమ్.. తర్వాత నువ్వే నువ్వే సినిమాతో దర్శకుడిగా మారాడు. తర్వాత అతడు, జల్సా, జులాయి, అత్తారింటికి దారేది, అ ఆ, అరవింద సమేత వంటి సక్సెస్ సినిమాలను తెరకెక్కించాడు.

ఇటీవలే రిలీజ్ అయిన అల వైకుంఠపురంలో మూవీతో బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకున్నాడు. అల్లు అర్జున్ కెరీర్ లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా అల వైకుంఠపురంలో నిలిచింది. అయితే ఈ సినిమాని విమర్శించే వాళ్ళూ లేకపోలేదు. 1956లో రిలీజైన రామారావు నటించిన ‘ఇంటిగుట్టు’ చిత్రాన్ని కాపీ కొట్టాడని విమర్శించారు. ఈ మూవీలో పూజాహెగ్డే పాత్రను త్రివిక్రమ్ చూపించిన విధానం చాలా మందికి అసలు నచ్చలేదు. పూజాహెగ్డే పాత్ర సినిమాలో కనిపించడంతోనే ఆమె తొడల మీద ఫోకస్ చేసినట్లు స్పష్టంగా అర్థం అవుతుంది.

ఏకంగా ఆమె తొడలు చూపిస్తూ ఒక సాంగ్ కూడా సినిమాలో ఉంది. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకలుగా విమర్శలు చేస్తున్నారు. “నీ కాళ్ళను పట్టుకు వదలనంది చూడే నా కళ్ళు..” అని కాకుండా “నీ తొడలు పట్టుకు వదలనంది చూడే నా కళ్ళు…” అని రాస్తే బాగుండేది అని కామెంట్ చేస్తున్నారు. మరి కొందరైతే గురూజీ గా పిలవబడే త్రివిక్రమ్ రాను రాను “లీకేజీ”గా మారిపోతున్నారని విమర్శిస్తున్నారు. రాబోయే సినిమాల్లో అయినా ఇలాంటివి ఫోకస్ చేయకుండా ఉంటే బేటర్ అని త్రివిక్రమ్ కు సలహా ఇస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -