Friday, April 19, 2024
- Advertisement -

రశ్మీ విషయం లో భారీ రూమర్ లు

- Advertisement -

బుల్లితెర మీద జబర్దస్త్ షోతో మంచి పాపులారిటీ సంపాదించి ఆ తర్వాత గుంటూర్ టాకీస్ సినిమాతో ప్రేక్షకుల హృదయాల్లో గిలిగింతలు పెట్టిన రేష్మి ఎప్పుడు ఏదో ఒక న్యూస్ తో మీడియాలో నానుతూనే ఉంది.

మొన్నటిదాకా జబర్దస్థ్ టీం లో ఒకరితో డేటింగ్ లో ఉందంటూ వచ్చిన వార్తలను తోసిపుచ్చి డేటింగ్ నిజమే కాని జబర్దస్త్ టీమెట్ తో కాదు తన హీరోతో అని ఓపెన్ గా చెప్పేసిన ఈ చిన్నది.. ఇప్పుడు ఏదో సర్జరీ కోసం యూఎస్ వెళ్లేందుకు సిద్ధమవుతుందని టాక్. అయినా రేష్మి సర్జరీ చేసుకోవాల్సిన అవసరం ఏముందని అందరి డౌట్.

గుంటూర్ టాకీస్ క్రేజ్ తో వరుసగా సినిమాలు చేస్తున్న రేష్మి ఓ పక్క జబర్దస్థ్ లో కూడా తన హవా కొనసాగిస్తుంది. మరి అలాంటి రేష్మి సర్జరీ కోసం యూఎస్ వెళ్తుందని వార్తలు వస్తున్నాయి. అయితే దీనికి సంబందించి ఓ క్లారిటీ రావాలంటే రేష్మి లేదా ఆమెకు సంబందించిన ఎవరైనా నోరు విప్పితేనే తెలుస్తుంది. ప్రస్తుతం రేష్మి నటిస్తున్న రెండు సినిమాలు లేడీ ఓరియెంటెడ్ కథలే.. మరి ఇలాంటి టైంలో ఆమె గురించి ఎటువంటి రూమర్లు రాకుండా కెరియర్ జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే మంచి అవకాశాలతో పాటుగా మంచి మొత్తాన్ని కూడా కూడబెట్టుకునే అవకాశం ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -